సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఎదగక పోవడానికి కచ్చితంగా ఇతరులు కారణం అయి ఉండొచ్చు. కానీ కొందరి విషయంలో సొంత వాళ్లే దూరం పెడతారు. అయితే ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ వాటన్నింటినీ దాటుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. ఆయనెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈయనని కొన్ని సంవత్సరాల దాకా నందమూరి కుటుంబం చేరదీయలేదు.
కనీసం మనిషిగా కూడా గౌరవించలేదు. దీనికి ఒక కారణం హరి కృష్ణ మొదటి భార్య లక్ష్మీ ఉండగానే మరో యువతి అయినా శాలిని తో వివాహ జీవితాన్ని గడిపి జూనియర్ ఎన్టీఆర్ కి తండ్రి కావడమే. అయితే ఇలా జరగడంతో హరికృష్ణ ను ఎన్టీఆర్ మినహా ఎవరూ పట్టించుకోలేదు.కానీ తెలుసుకుని సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని తన వంశంలో కలుపుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. రామారావు చనిపోయాక ఎన్టీఆర్ కి అసలు కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే కసి మరోవైపు నందమూరి కుటుంబానికి దగ్గరవ్వాలనే ఆశ ఆయన మనసులో ఉండేవి. ఆయన గురించి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడిన అస్సలు పట్టించుకునే వాడు కాదు.
నటుడిగా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బాలకృష్ణ కూతురు నిశ్చితార్థ సమయంలో కూడా ఎన్టీఆర్ ని పిలిచి ఎవరూ పట్టించుకోలేదు. దాంతో మనస్థాపానికి గురై ప్రోగ్రాం మధ్యలో నుంచే వచ్చేశారు. ఇంకా మనకు తెలియని ఎన్నో అవమానాలు ఎన్టీఆర్ పడ్డాడు. తన తాత నుంచి వచ్చిన మంచి లక్షణాలు కుటుంబం పరంగా, ఇండస్ట్రీ పరంగా విజయం సాధించి తాతకు తగ్గ మనవడిగా అందరికీ తెలిసేలా చేశాడు. ఎవరైతే అవమానించి వద్దనుకున్నారో వాళ్లే ఇప్పుడు మా వాడే అని చెప్పుకునేలా ఎదిగాడు.ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ని దగ్గరకు తీసుకున్నాడు.