వినోదం

Khushi : ఖుషి వ‌ర్సెస్ న‌ర‌సింహ నాయుడు.. రెండింటిలో ఏది పెద్ద హిట్ అయింది అంటే..?

Khushi : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఖుషీ చిత్రం ఒక‌టి. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు అదే ఏడాది వచ్చిన నరసింహనాయుడు. బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగు సినీ చరిత్రలో నరసింహనాయుడు మొదటిసారి 20కోట్ల షేర్ వసూలు చేసిన మూవీగా నిల్చింది. మొత్తం మీద 22కోట్ల వరకూ షేర్ వసూలు రాబట్టింది. 105కేంద్రాల్లో 100రోజులు ఆడింది.

ఇక నరసింహనాయుడు వందరోజులు ఆడిన తర్వాత ఖుషి చిత్రం విడుదలైంది. సంచలన విజయాన్ని నమోదుచేస్తూ 20కోట్లకు పైనే షేర్ వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే 8కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసి ఔరా అని అనిపించింది. ఈ చిత్రం 79కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. అయితే నరసింహనాయుడు వంద రోజుల రికార్డ్ ని మాత్రం క్రాస్ చేయలేదు. అయితే కలెక్షన్స్ పరంగా నైజాం,కృష్ణ జిల్లాల్లో నరసింహనాయుడిని క్రాస్ చేసేసింది. మిగిలిన ఏరియాల్లో క్రాస్ చేయలేకపోయింది. దీంతో 21కోట్లకు పైనే వసూలు చేసి ఆల్ టైం టాప్ టు మూవీగా నిల్చింది. ఖుషి : 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, న‌ర‌సింహానాయుడు చిత్రం 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

khushi vs narasimha naidu collections comparison

క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే ఖుషి: 21 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది. న‌ర‌సింహానాయుడు : 22 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది. బ‌డ్జెట్‌లో ఖుషి: 2.5 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా, న‌ర‌సింహానాయుడు : 2 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇలా ఏవిధంగా చూసినా… నరసింహనాయుడు సినిమా ఖుషి పై పైచేయి సాదించినట్టే కనిపిస్తుంది. ఇదే కాకుండా బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

Admin

Recent Posts