వినోదం

Balakrishna : సినిమా క‌థ విన‌లేదు.. అయినా ఆ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌..

Balakrishna : నందమూరి బాలక్రిష్ణ సీనియర్లలో టాప్ హీరో. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయికుడు. తండ్రి మాదిరిగానే ఒక్క జాన‌ర్‌కి ప‌రిమితం కాకుండా వైవిధ్య‌మైన సినిమాలు చేశాడు. ఇక భైర‌వ ద్వీపం చిత్రంతో అప్పటి జనరేషన్ లో ఎవరు చేయని సాహాసాన్ని బాలయ్య చేశారు. ఇక జానపద సినిమాలకు సీన్ లేదనుకున్న సమయంలో ‘భైరవద్వీపం’తో బంపర్ హిట్ కొట్టారు. ఆ తరంలో జానపదాలకు ఎన్టీఆర్.. ఈ తరంలో బాలకృష్ణ అనే విధంగా జానపద సినిమాలకు పెద్ద దిక్కైయ్యారు. 1994లో విడులైన ‘భైరవద్వీపం’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. అయితే, ఆ సినిమా కోసం బాలకృష్ణ పడ్డ కష్టాలు మాములు కాదు.

బి వెంక‌ట‌రామిరెడ్డి బృందావ‌నం సినిమా త‌ర‌వాత ఓ జాన‌ప‌ద చిత్రాన్ని నిర్మించాల‌ని అనుకోగా, అది బాలయ్య‌తో చేస్తే బాగుంటుంద‌ని భావించి సంప్రదించారు. ఇక బాల‌య్య క‌థ విన‌కుండానే ఆ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ సినిమాకు న‌టుడు రావి కొండ‌ల రావు క‌థ‌ను అందించారు. క‌థ‌లో ఎన్నో ట్విస్ట్ ల‌ను జోడించ‌డంతో నిర్మాత‌లు ఫిదా అయ్యారు. విజ‌య నిర్మాణ సంస్థ‌పై ఉన్న న‌మ్మకంతో బాల‌య్య కాల్ షీట్స్ ఇచ్చారు. పాతాల భైర‌వి సినిమా టైటిల్ లో నుండి భైర‌వి అనే పేరును తీసుకుని భైర‌వద్వీపం అని టైటిల్ పెడితే భాగుంటుంద‌ని రావికొండ‌ల రావు భావించారు.

bhairava dweepam movie interesting facts

ఇదే విష‌యాన్ని నిర్మాత‌ల‌కు చెప్ప‌గా వాళ్లు కూడాగ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.. సినిమాలో రాజకుమారి పాత్ర‌కు రోజాను ఎంపిక చేయ‌గా, స్పెష‌ల్ సాంగ్ కోసం రంభ ను ఒప్పించారు. అలా సినిమా కాస్ట్ మొత్తాన్ని ఎంపిక చేశారు. రాజ్ కుమార్ ను మాంత్రికుడి పాత్ర‌లో ఎంపిక చేసుకున్నారు. అప్ప‌ట్లోనే ఈ సినిమాని 4 కోట్ల‌తో నిర్మించ‌గా 1994 ఎప్రిల్ లో విడుద‌ల చేశారు. ఈ సినిమా 59 థియేట‌ర్ ల‌లో వంద‌రోజులు ఆడి అప్ప‌ట్లో రికార్డులు క్రియేట్ చేసింది. విజయ్ పాత్రలో వీరుడిలా విశ్వరూపం చూపించిన బాలకృష్ణ.. ఓ సీన్‌లో కురూపిలా మారిపోతాడు. అప్పటివరకు మాస్ హీరోగా, లవర్‌ బాయ్‌గా కనిపించిన బాలయ్యను ‘భైరవద్వీపం’లో అలా చూసి అభిమానులు థియేటర్లో షాకయ్యారు.

Admin

Recent Posts