Manchu Lakshmi : మోహన్ బాబు నట వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్న మంచు లక్ష్మి.. నటిగా, నిర్మాతగానే కాకుండా హోస్ట్ గా కూడా తానేంటో చూపిస్తోంది. ఇప్పటికే చాలా షోస్ కు యాంకర్ గా అదరగొట్టిన మంచు.. రీసెంట్ గా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఆహాలో కుకింగ్ షో తో అదరగొడుతుంది. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చిన పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు సాగుతుంది.
విదేశాల్లో చదువుకున్న మంచు లక్ష్మి హాలీవుడ్ సీరియల్స్ లో కూడా నటించింది. ఆ తరువాత తెలుగు సినిమాపై మక్కువతో ఇక్కిడికి వచ్చింది. అనగనగ ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి మంచు లక్ష్మి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి అలరించింది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు హీరోగా నటించిన పద్మవ్యూహం సినిమాలో నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయడంతో పాటూ ఆయనే ఈ సినిమాను నిర్మించారు కూడా.
ఈ చిత్రంలో మంచు లక్ష్మీ మోహన్ బాబు కూతురిగా నటించింది. ఇందులో ఓన్ వాయిస్‌తో అలరించింది. ఈ సినిమా 1980లో విడుదల కాగా మంచి విజయం సాధించింది. ఇక మంచు లక్ష్మీ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసింది. తన పర్సనల్ విషయాలతో పాటు.. హోమ్ టూర్లతో హడావిడి చేస్తోంది. ఇక మంచువారి గురించి ఈ మధ్య మీమ్స్ ఏ రేంజ్ లో పేలుతున్నాయో అందరికి తెలిసిందే..? అయితే అవేవి పట్టించుకోకుండా దూసుకుపోతోంది లక్ష్మీ ప్రసన్నా.