వినోదం

Narasimha Naidu Movie : నరసింహనాయుడు సినిమా తీయడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Narasimha Naidu Movie &colon; బి&period;గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం నరసింహనాయుడు&period; ఈ సినిమా జనవరి 12&comma; 2001లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ బరిలో దిగింది&period; ఈ సినిమాలో బాలయ్య సరసన సిమ్రాన్&comma; ప్రీతి జింగానియా&comma; ఆశాసైని హీరోయిన్స్ గా నటించారు&period; కె&period;విశ్వనాథ్&comma; అచ్యుత్&comma; తనికెళ్ల భరణి&comma; జయప్రకాశ్ రెడ్డి&comma; ముఖేష్ రిషి&comma; సత్య ప్రసాద్&comma; బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించారు&period; మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాకి ఒక ప్రత్యేకం స్థానం ఉంది అని చెప్పాలి&period; సంక్రాంతి బరిలో దిగిన నరసింహనాయుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; ఈ చిత్రానికి ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథను అందించగా పరుచూరి గోపాలకృష్ణ మాటల రచయితగా వ్యవహరించారు&period; అప్పట్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా పాతిక కోట్లకు పైగా కలక్షన్స్ ని రాబట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65498 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;narasimha-naidu-movie&period;jpg" alt&equals;"Narasimha Naidu Movie interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమా సెట్స్ పైకి రాకముందు తెర వెనక చాలా కథ జరిగిందట&period; బాలకృష్ణ బి&period;గోపాల్ కాంబినేషన్ లో అప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి&period; దాంతో ఈ సినిమా వారి కాంబినేషన్ లో వచ్చిన మూడోవా సినిమా&period; అయితే నిజానికి ఈ సినిమా కంటే ముందు బి&period;గోపాల్&comma; పోసాని కృష్ణ మురళి అందించిన కథతో అయోధ్య రామయ్య అనే సినిమాను తీయాలని అనుకున్నారు&period; ఈ సినిమాకు ముహూర్తపు షాట్ ను కూడా తీశారు&period; హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో సినిమా షూటింగ్ ను ప్రారంభించగా అక్కడకు బాలయ్య బాబు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు&period; బాలయ్య బి&period; గోపాల్ కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ లు తీయడంతో మూడో సినిమా కచ్చితంగా హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు&period; దాంతో బి&period;గోపాల్ మళ్ళీ ఆలోచనలో పడ్డారు&period; వెంటనే రచయిత చిన్నికృష్ణ కు ఫోన్ చేసి కథ కావాలని అడిగారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రచయిత చిన్నికృష్ణ బీహార్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తయారు చేసిన కథను బి&period;గోపాల్ కు వినిపించడం జరిగిందట&period; బి&period;గోపాల్ చిన్నికృష్ణ కలిసి అదే కథను పరుచూరి బ్రదర్స్ కు సైతం వినిపించారు&period; ఇక ఆ కథకు బాగా నచ్చడంతో కొన్ని మార్పులు చేర్పులు చేసి నరసింహ నాయుడు సినిమాను తెరకెక్కించారు&period; అంతే కాకుండా పోసాని కృష్ణ మురళీ రాసిన అయోధ్య రామయ్య సినిమా కథను పక్కన పెట్టేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts