హెల్త్ టిప్స్

వంట నూనెలను పదే పదే వేడి చేసి వాడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

నిత్యం మనం వండుకునే అనేక రకాల కూరల్లో కచ్చితంగా నూనె పడాల్సిందే. నూనె లేకపోతే ఏ కూరను వండుకోలేం. కూరలు రుచిగా ఉండవు. ఇక మనకు మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ స్థోమత, అభిరుచులకు తగిన విధంగా వంట నూనెలను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే చాలా మంది వంట నూనెలను పదే పదే వేడి మరీ ఉపయోగిస్తుంటారు. నిజానికి అలా చేయడం మంచిది కాదు. దాంతో ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* వంట నూనెలను పదే పదే వేడి చేసి ఉపయోగించడం వల్ల వాటిల్లో కార్సినోజెన్లు అనబడే పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఇవి విషంతో సమానం. ఈ క్రమంలో అలాంటి నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. అలాగే స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది.

if you are using cooking oil by reheating it then it is very harmful for health

* పదే పదే వేడి చేసిన వంట నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

* ఎక్కువ సార్లు వేడి చేయబడిన వంట నూనెతో అసిడిటీ సమస్య వస్తుంది. శరీర జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.

* చాలా సార్లు వేడి చేసిన నూనెను ఉపయోగిస్తే క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుక ఏ వంట నూనె అయినా సరే కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు.

Admin

Recent Posts