వినోదం

ఇంద్రుడి పెద్దకూతురు శ్రీలీల.. రెండో కూతురు జాన్వి..!

యువ హీరోల్లో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాడు నవీన్ పొలిశెట్టి. అతనికి ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర చేసిన అతను ముంబై వెళ్లి అక్కడ మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ క్రేజ్ తో తెలుగులో లీడ్ రోల్ ఛాన్స్ అందుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఇలా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ మీద ఎప్పుడు సరదాగా ఉంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.

నవీన్ పొలిశెట్టి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. అతనితో పాటు శ్రీలీల కూడా వచ్చింది. తనతో ఉన్న శ్రీలీలను ఇంప్రెస్ చేసేందుకు నవీన్ చాలా ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా శ్రీలీల మదర్ వచ్చి వెళ్లగా మిగతా విషయాలు ఆమెతో మాట్లాడుతా అన్నారు. కాబోయే అమ్మాయికి శ్రీలీలలో ఉన్న క్వాలిటీస్ ఉండాలని అన్నాడు.

naveen polishetty comments on sreeleela

ఐతే ఈ షోలో భాగంగా నవీన్ బాలకృష్ణ తోని బ్రతక నేర్చిన వాడివి అనేలా చేసుకున్నాడు. అలా ఎందుకు అన్నారంటే.. ఇంటర్వ్యూలో భాగంగా జాన్వి కపూర్, శ్రీలీలలో ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని బాలకృష్ణ అడిగారు. దానికి నవీన్ సమాధానం ఇస్తూ ఇంద్రుడి కూతురు లాంటి శ్రీలీల అని సమాధానం ఇస్తాడు. ఐతే బాలకృష్ణ మరి జాన్వి అంటే ఇంద్రుడి రెండో కూతురు అంటాడు. అప్పుడు అవాక్కయిన బాలయ్య ముంబై వెళ్లి బ్రతక నేర్చిన వాడివని.. గాడ్ బ్లెస్ యు అని అన్నారు.

Admin

Recent Posts