వినోదం

Sobhan Babu : రజినీకాంత్ 14 సార్లు ఏకధాటిగా చూసిన శోభన్ బాబు మూవీ ఏంటీ.. ఆ సినిమా ఎందుకంత ప్రత్యేకం అంటే..?

Sobhan Babu : సినీ హీరోలు ఎంతోమంది ఉన్నా.. నట భూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయనను అభిమానించే వారు ఇప్పటికీ ఆయన జయంతి, వర్ధంతిలను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. శోభన్ బాబు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా.. డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారు. సోగ్గాడు శోభ‌న్ బాబు మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా ఆయ‌న చేసిన సినిమాలు ఇప్ప‌టికే ప్రేక్ష‌కులు చూస్తూనే ఉన్నారు. శోభ‌న్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాలు ఒక‌వైపు శోభ‌న్ బాబు చేసిన మాన‌వుడు దాన‌వుడు సినిమా మరొక‌వైపు.

ఈ సినిమా కంటే ముందు శోభ‌న్ బాబుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ఉండేది. కానీ మాన‌వుడు దాన‌వుడు సినిమా శోభ‌న్ బాబును స్టార్ గా నిల‌బెట్టింది. ఈ సినిమా వసూళ్ల వ‌ర్షం కురిపించి బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను హీరో రజినీకాంత్ చూశార‌ట‌. అయితే అప్పుడు రజినీకాంత్ మాత్రం హీరో కాదు. బెంగుళూరులో బ‌స్ కండ‌క్టర్ గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో తాను ఈ సినిమాను చూశానని ర‌జినీకాంత్ చెబుతుంటారు. రజినీ సినిమా చూడటం పెద్ద వింత ఏమీ కాదు కానీ ర‌జినీకాంత్ కు ఈ సినిమా తెగ న‌చ్చ‌డంతో ఏకంగా 14సార్లు థియేట‌ర్ లో చూశాడ‌ట‌.

rajnikanth watched this shobhan babu movie 14 times

ఇక శోభ‌న్ బాబు న‌టించిన సంపూర్ణ రామాయ‌ణం 100 రోజులు పూర్తి చేసుకున్న రోజునే మాన‌వుడు దాన‌వుడు సినిమా విడుద‌ల‌వ్వ‌డం విశేషం. అలా విడుద‌లైనా సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు కూడా క‌నెక్ట్ అవుతుంది. హీరో అక్క చిన్న వ‌య‌సులో లైంగిక దాడికి గుర‌వుతూ ఉంటుంది. హీరో పెరిగి పెద్ద‌వాడ‌య్యాక ఉద‌యం మంచివాడిగా డాక్ట‌ర్ గా క‌నిపిస్తూ రాత్రుళ్లు మాన‌వ‌మృగాల‌ను వేటాడుతూ ఉంటాడు. సినిమా చూస్తున్నంత‌సేపు డ‌బుల్ యాక్ష‌న్ అనిపిస్తుంది కానీ సినిమా పూర్త‌యిన తర్వాత ఇద్ద‌రూ ఒక్క‌రే అనే ట్విస్ట్ తెలిసిపోతుంది. ఈ మూవీ ఒక్క రజినీకే కాదు ప్రేక్షకులందరికీ తెగ నచ్చేసింది.

Admin

Recent Posts