వినోదం

Tollywood: ఈ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్టర్.. అత‌డ్ని గుర్తు ప‌ట్టారా..!

Tollywood: సోష‌ల్ మీడియాలో ఎన్నో త్రో బ్యాక్ పిక్స్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొన్ని పిక్స్ మాత్రం ప్రేక్ష‌కులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అస‌లు అందులో త‌మ అభిమాన స్టార్స్‌ని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న పిక్‌లో ఉన్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్. ఇండియా సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా పాకేలా చేసిన వ్య‌క్తి. ఇటీవ‌ల వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ఓ స్టార్‌ హీరో కాదు. నటుడు కూడా కాదు. కానీ అంతకుమించిన సెలబ్రిటీ. మనసులో ఏదీ దాచుకోడు.

సందర్భమేదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తిత్వం అత‌ని సొంతం. సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగానూ కొందరిపై సెటైర్లు వేస్తూ హాట్ టాపిక్ అవుతుంటాడు. తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ సెలబ్రిటీ ఎవరో గుర్తు పట్టేసినట్టున్నారా కదా? యస్‌. మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆయన మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. శివ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆయన క్షణక్షణం, గాయం, మనీ, రంగీలా, దెయ్యం, అనగనగా ఒకరోజు, సత్య, కంపెనీ, సర్కార్‌, రక్త చరిత్ర, వీరప్పన్‌ తదితర సినిమాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా అందరి మ‌న‌సుల‌లో నిలిచిపోయాడు.

rgv childhood photo viral

ఒక‌ప్పుడు వ‌ర్మ నుండి సినిమాలు వ‌స్తుంటే అవి బాక్సాఫీస్‌ని షేక్ చేసేవి. కాని ఇప్పుడ‌లా క‌నిపించ‌డం లేదు. సినిమాల క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌ వేదికగా కొందరి రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తుంటాడు. మొత్తానికి ఏదో ఒక అంశంపై తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. కాగా రామ్‌గోపాల్ వ‌ర్మ రేర్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.ఇందులో తల్లితో దిగిన ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుండ‌గా,ఇందులో చాలా బక్కపల్చగా అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు ఆర్జీవీ.

Admin

Recent Posts