Categories: వినోదం

Sai Pallavi : అసౌకర్యానికి గురి చేసే ప్రశ్న అడిగిన జర్నలిస్టు.. ఫైర్‌ అయిన సాయిపల్లవి..!

Sai Pallavi : నాని, సాయిపల్లవి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. శ్యామ్‌ సింగరాయ్‌. ప్రస్తుతం ఈ మూవీకి గాను చిత్ర యూనిట్‌ ప్రమోషన్లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నాని, సాయిపల్లవి, కృతిశెట్టిలు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. కాగా ఓ టీవీ చానల్‌కు వీరు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి ఫైర్‌ అయ్యింది.

Sai Pallavi angry over journalist for asking uncomfortable question

ఇటీవలే విడుదలైన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో నాని, కృతి శెట్టిలకు చెందిన లిప్‌ లాక్‌ సీన్‌ ఒకటి ఉంటుంది. అయితే దీనిపైనే ఆ జర్నలిస్టు ప్రశ్న అడిగింది. దీంతో సాయిపల్లవి మధ్యలో కలగజేసుకుని జవాబు ఇచ్చింది.

నాని, కృతి శెట్టిల లిప్‌లాక్‌ సన్నివేశంలో ఎవరు కమ్‌ఫర్ట్‌గా ఉన్నారు ? నానినా, కృతిశెట్టినా ? అని ఆ జర్నలిస్టు అడిగింది. ఇందుకు కలగజేసుకున్న సాయిపల్లవి మాట్లాడుతూ.. అది చాలా అసౌకర్యాన్ని కలిగించే ప్రశ్న. అలాంటి సీన్లలో నటించడం అంటే హీరో హీరోయిన్లలో ఇద్దరికీ అసౌకర్యంగానే ఉంటుంది. సినిమాలో కథకు తగినట్లుగా సీన్లు ఉంటాయి. అంతమాత్రం చేత అలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా ? అని సాయి పల్లవి ఫైర్‌ అయ్యింది.

ఇక సినిమాలో రొమాంటిక్‌ సీన్లు ఏమైనా ఉన్నాయా ? అని ఆ జర్నలిస్టు మళ్లీ అడిగింది. ఇందుకు సాయి పల్లవి మళ్లీ స్పందిస్తూ.. మీరు ఇలాంటి ప్రశ్నలే అడగాలని నిర్ణయించుకున్నారా ? మాకు అలాంటి సీన్లతో పెద్దగా పట్టింపు ఉండదు. కథకు అనుగుణంగా ఎలాంటి సీన్‌ కావాలంటే అలాంటి సీన్‌లో నటీనటుల అంగీకారం మేరకు నటిస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకు సంతోషంగా ఉందని.. జవాబు ఇచ్చింది.

కాగా శ్యామ్‌ సింగరాయ్‌ డిసెంబర్‌ 24వ తేదీన తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో భాగంగా సాయి పల్లవి భావోద్వేగానికి గురైంది. తనను ఆదరిస్తున్న హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. తనకు మంచి నటిగా అవార్డు వచ్చినప్పుడు మళ్లీ ఏడుస్తానని చెప్పింది.

Editor

Recent Posts