వినోదం

Sanghavi : పృథ్వీ చేతిలో సంఘ‌వి మోస‌పోయిందా.. అస‌లు సంగతి ఏంటి..?

Sanghavi : హాయ్‌ రే హాయ్‌.. జాం పండు రోయ్‌’ అంటూ సింధూరం సినిమాలో రవితేజను తన వెంట తిప్పుకుంది హీరోయిన్‌ సంఘవి . కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 1993-2004 మధ్యకాలంలో దక్షిణాదిని స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. మొత్తం 15 ఏళ్ల సినిమా కెరీర్‌లో 80కు పైగా చిత్రాల్లో న‌టించిన సంఘ‌వి తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. కాగా 90 వదశకంలో హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సంఘవి.

సంఘ‌వి త‌న‌ కెరీర్‌లో సింధూరం, తాజ్‌ మహల్‌, నాయుడుగారి కుటుంబం, సూర్యవంశం, సమర సింహారెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే, లాహిరి లాహిరి లాహిరిలో, సందడే సందడి వంటి హిట్‌ సినిమాలున్నాయి. కాగా ఆలస్యంగా అంటే 38 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. 2016లో బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ అనే ఐటీ ఉద్యోగితో కలిసి పెళ్లిపీటలెక్కారు. ఆతర్వాత 42 ఏళ్ల వయసులో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఓ షోలో సందడి చేసిన సంఘవి.. యాక్టర్ పృధ్వీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తనను మోసం చేశారంటూ వాపోయారు. అతను చేసిన మోసం త్వరగా తెలిసిపోయిందని చెప్పారు.

sanghavi told interesting matter about prudhvi

సంఘవి మాట్లాడుతూ.. ఓ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకుని నైట్ వస్తున్నాము.. అంతలో పృధ్వీ వచ్చి నా వైఫ్ ప్రెగ్నెంట్. కనీసం వీళ్లు కేక్ అడిగితే ఇవ్వడం లేదు అన్నాడు. నేను చాలా సీరియస్‌గా రెస్టారెంట్‌కు వెళ్లి పోయి.. కేక్ ప్యాక్ చేయించి ఇచ్చాను. తర్వాత ఎయిర్ పోర్టులో తనని, తన వైఫ్‌ను చూశాను అప్పుడే తెలిసింది ఆమె ప్రెగ్నంట్ కాదు అని. అయితే అసలు విషయం తెలియక‌ నేను వెళ్లి అడిగాను. దాంతో పృధ్వీ బండారం బయట పడింది అన్నారు. ఆమెని ఎన్నో నెల అని అడిగాను. అదేంటి.. అన్నట్టు ఎక్స్ ప్రెషన్స్ పెట్టింది ఆమె. దాంతో విషయం అర్ధం అయ్యింది. ప్రెగ్నెంట్ కాకపోయినా.. అబద్దం చెప్పి ఆయన కేక్ తీసుకెళ్లారు అని సంఘవి చెప్పింది. దాంతో వెంటనే అందుకున్న మహేశ్వ‌రి.. ఒక వేళ ఆయన ప్రెగ్నేంటేమో అని సరదా కామెంట్ చేసేస‌రికి.. అక్కడ అంతా నవ్వులు పూశాయి.

Admin

Recent Posts