వినోదం

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు ప‌ట్టారా.. ఈమె స్టార్ హీరోయిన్‌..!

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ ఇటీవ‌ల తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. హీరోలు, హీరోయిన్స్ పిక్స్ చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతుంటారు. కొంద‌రిని ఈజీగా గుర్తు ప‌ట్టే ఛాన్స్ ఉంటుంది కాని మ‌రి కొంద‌రిని గుర్తు పట్ట‌డం క‌ష్టం. తాజాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ అమ్మ‌డు 2001లో ‘ఇష్టం’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత తెలుగుతో పాటు ప‌లు భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె ఎవ‌రో కాదు శ్రియ‌.

2018లో కెరీర్ పరంగా కాస్త డౌన్ అయిన టైంలో ఆండ్రూ కొశ్చివ్ అనే ఫారెనర్ ని పెళ్లి చేసుకుంది. లాక్ డౌన్ టైంలో ఓ పాపకి జన్మనిచ్చింది. కానీ ఆ విషయాన్ని ఏడాదిన్నర తర్వాత బయటపెట్టింది.ఇక అప్ప‌టి నుండి శ్రియ సోష‌ల్ మీడియా, సినిమాల‌లో తెగ ర‌చ్చ చేస్తుంది. భ‌ర్త‌తో క‌లిసి తెగ రెచ్చిపోతూ ఆమె చేసే సంద‌డికి పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. చైల్డ్ హుడ్ పిక్ లో చాలా క్యూట్‌గా, చ‌బ్బీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మాత్రం అందాల‌న్నీ ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. శ్రియ శరణ్ వయసుతో పాటు గ్లామర్‌ కూడా పెరుగుతోంది. నాజూకైన తన అంద, చందాలను సోషల్ మీడియాలో పరిచేసి అందర్ని ఉక్కిరిబిక్కరి చేస్తోంది.

shriya saran childhood photo viral

పెళ్లైనా..ఓ పిల్లకు తల్లైనా శ్రియ శరణ్ స్లిమ్‌ ఫిజిక్, గార్జియస్ గ్లామర్‌తో జీరో సైజ్ బ్యూటీగా కనిపిస్తూ వారెవ్వా అనిపిస్తుంది.. పలుచని నడుము పైకి కనిపిస్తున్న పరువాలతో టాలీవుడ్ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ని షేక్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది.

Admin

Recent Posts