వినోదం

సీతారామం సినిమాలోని ఆ సీన్ ను ఆ సినిమానుంచి తీసుకున్నారా ?

సీతారామం మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాపై కొంతమంది నెటిజన్స్ విపరీతంగా ట్రోలింగ్ చేశారు.. ఈ సినిమాలో ఒక సీన్ ను వెంకటేష్ కత్రినా కైఫ్ నటించిన మల్లీశ్వరి లవ్ సీన్ ను పోలి ఉందంటూ ట్రోల్ చేశారు.. దీనిపై దర్శకుడు హను రాఘవపూడి స్పందించి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నేను ఏ సినిమాలో నుంచి కాపీ కొట్టలేదని ” అందులో ని లవ్ ప్రపోజల్ సీన్ చాలా సింపుల్ ఐడియా అన్నారు “

ఒక అబ్బాయి తన లవర్ కు భరోసా ఇవ్వడాన్ని ఆ సీన్ లో చూపించాలి అనుకున్నా.. అందుకోసమే ఆ హీరోతో నేను నేను నెలకు 600 సంపాదిస్తున్న..బ్యాంకులో 12000 ఉంది.. దీంతో మనం ఇల్లు కొనుక్కుందాం.. అని చెప్పించాను. ఇది కేవలం నా ఐడియా మాత్రమే అని అన్నారు. ఈ సీన్ కోసం మల్లీశ్వరి నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఏది ఏమైనా దీన్ని మీరు మల్లీశ్వరితో పోల్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా కోసం నేను అప్ప‌ట్లో వేరే హీరోలను సంప్రదించాననే వార్తల్లో నిజం లేదని నేను మొదటి నుంచి ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నే అనుకున్నానని క్లారిటీ ఇచ్చారు..

sitaramam movie scene is this copied from malleshwari movie

ఈ స్టోరీ డిజైన్ చేసినప్పుడే రామ్ పాత్రకి దుల్కర్ ని అనుకున్నానని అన్నారు. కానీ ఈ మూవీ ప్రకటించిన తర్వాత నాని,రామ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ను కలిశానని, వారందరూ వద్దనడం వల్లే, ఈ ప్రాజెక్టులోకి దుల్కర్ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి..నిజం చెప్పాలి అంటే నాని తో నేను ఒక కొత్త ప్రాజెక్టు చేయాలనుకుంటున్నానని, అది రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని, ఈ ప్రాజెక్టు కోసమే ఆయన్ని కలిశాను అని, అలాగే ఇంకా వేరే కథల కోసం రామ్, విజయ్ లను కలిశానని హను రాఘవపూడి తెలియజేశారు.

Admin

Recent Posts