Soundarya : తెలుగు సినీ ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోయిన్ సౌందర్య. నటి సౌందర్య జీవితంలో జనానికి తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆమె నట జీవితం నుంచి మరణం వరకూ ఎన్నో జరిగాయి. నిజానికి ఆమె మరణం ఓ మిస్టరీ. ఈరోజు ఆమె మన ముందు ఉంటే భాజపా ప్రభుత్వంలో ఓ కీలక పదవిలోనూ ఉండి ఉండేది. . బెంగళూరుకు చెందిన సౌందర్య హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే. అదే ‘రైతు భారతం’. ముందుగా విడుదలైంది మాత్రం ‘మనవరాలి పెళ్లి’. సౌందర్య తొలి సినిమా పారితోషికం రూ. 25వేలు. ఆమె ఎంతో మంది టాప్ హీరోలతో నటించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందింది.
ఆమె చనిపోయి కూడా ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళు పైగా అయినప్పటికి ఆమె గురించి ఇప్పటికి ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.ఆమెను అభిమానించే వారు ఆమె మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోవడం లేదు. అసలు జీవితంలో ఏమి చూడకుండానే కేవలం పెళ్లయిన కొన్ని రోజులకే మూడు నెలల గర్భవతి గా ఉన్న ఆమె ఇలా ఫ్లైట్ ప్రమాదం లో మరణిస్తారని అసలు ఎవరు ఊహించలేదు. ఆమె తండ్రి సౌందర్య జాతకం పుట్టినప్పుడే రాసారు.ఆమె ఇలా స్టార్ డం సంపాదించుకొని అర్దాయుష్షు తో కన్ను మూస్తుందని అయన ఏనాడో చెప్పారట.
ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన సౌందర్య తన జీవితంలో చేసిన ఒక తప్పు మచ్చగా మారింది. ఆమె పెళ్లి తల్లి దండ్రులకు నచ్చలేదు. సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అంటే ఆమె తల్లిదండ్రలకు ఇష్టం లేదట. ప్రతి విషయంలోనూ తల్లి దండ్రుల మాట తీయని సౌందర్య పెళ్లి విషయంలో మాత్రం అలా చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. సౌందర్య వరుసకు మామ అయిన వ్యక్తి రఘును ప్రేమించింది. అయితే వీరిద్దరి జాతకాలలో దోషం ఉండటం వల్ల పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదట. అయినప్పటికీ అతడినే పెళ్లి చేసుకొని 31 ఏళ్లకు కన్నుమూసింది.