NTR : అప్పటి తరం మన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ప్రతి ఒక్కరూ స్వయంకృషితో పైకి వచ్చినవారే. నటనపై మక్కువతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచారు. 1980 కి ముందు చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ లో నిలబెట్టడం కోసం అప్పటి తరం మన స్టార్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు ఎంతో గొప్ప కృషి చేశారు.
వీరితో పాటు దర్శక నిర్మాతలు దాసరి నారాయణరావు, డి.రామానాయుడు కూడా ఇండస్ట్రీకి కొత్త రూపాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ పద్మాలయా స్టూడియోస్, దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్స్ వంటి ఎన్నో నిర్మాణ సంస్థలు ప్రారంభమయ్యాయి. ఎన్ని నిర్మాణ సంస్థలు ప్రారంభమైనా సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
అప్పట్లో మన అగ్రస్థాయి హీరోలకి ఇప్పటి తరం హీరోలు మాదిరిగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఉండేది కాదు. కేవలం ఎన్టీఆర్ చిత్రాలకు మాత్రమే రూ.50 లక్షల వరకు అధిక బడ్జెట్ ఉండేది. అంటే అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలు మాత్రమే అత్యధిక బడ్జెట్ చిత్రాలు. దక్షిణ భారతదేశం మొత్తంలో భారీ పారితోషికం అందుకొనే వారి లిస్ట్ లో ఎన్టీఆర్ ముందు ఉండేవారు. ఎన్టీఆర్ కేవలం ఒక్క సినిమాకి రూ.12 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.
ఆ తర్వాత ఏఎన్నార్ సినిమాలకు రూ.30 నుండి రూ.40 లక్షల బడ్జెట్ అయ్యేదట. ఏఎన్నార్ కూడా అప్పట్లో ఒక సినిమాకి రూ.10 లక్షలు తీసుకునేవారట. తర్వాత లిస్టులో మూడవ వారు కృష్ణ. ఒక్క సినిమాకి రూ.7 లక్షల రెమ్యూనరేషన్ అందుకునేవారట. ఇక శోభన్ బాబు కూడా రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారట. తర్వాత తరంలో వచ్చిన చిరంజీవి, సుమన్ రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఒక్కొక్క సినిమాకి పారితోషికంగా అందుకునేవారట. సుమన్, చిరంజీవి చిత్రాలకు కూడా అప్పట్లో రూ.17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదని సమాచారం. ఇలా అప్పట్లో వారు పారితోషికాలు అందుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు అయినా సరే రూ.కోట్లలో రెమ్యునరేషన్‌లను తీసుకుంటున్నారు.