Constipation : శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటికి పంపివేయాలి. లేదంటే అనారోగ్యాల పాలు కావల్సి వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వ్యర్థాల్లో ప్రధానంగా చెప్పుకోదగినది మలం. మనలో అధిక శాతం మంది మలబద్దకంతోనో లేదా ఇతర కారణాలతోనే నిత్యం విరేచనం సరిగా చేయరు. దీంతో వివిధ జబ్బులకు గురి కావల్సి వస్తుంది. మనం సాధారణంగా రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలతో ముగిస్తాం. అయితే 3 సమయాల్లోనూ తప్పనిసరిగా మల విసర్జన చేయాల్సిందే. అధిక శాతం వరకు 3 సార్లు ఎవరూ వెళ్లరు. 2 సార్లు వెళ్లే వారు కూడా చాలా తక్కువగానే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మల విసర్జన సాఫీగా జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెస్టర్న్ తరహా మరుగుదొడ్లకు వెళ్లేవారు 90 డిగ్రీల కోణంలో సాధారణంగా కూర్చుంటారు. అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే మల విసర్జన సరిగా జరిగేందుకు ఇది ఏమాత్రం దోహదం చేయదు. ఆ తరహా మరుగుదొడ్డి ఉన్నా సరే బేసిన్‌పై 35 డిగ్రీల కోణం వచ్చేలా కూర్చోవాలి. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది. పీచు (ఫైబర్) ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రధానంగా బ్రకోలి, కాలిఫ్లవర్, క్యాబేజీ, ఆకుపచ్చని కూరగాయలు, యాపిల్స్, క్యారెట్లు, బెర్రీలు, నారింజ, నిమ్మ వంటి వాటితోపాటు సల్ఫర్ ఉండే గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ముల్లంగి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
రోజుకు సరాసరిగా ఒక వ్యక్తి దాదాపు 15 గ్రాముల ఫైబర్ ఉన్న ఆహార పదార్థాన్ని తింటాడు. అయితే మనకు కనీసం 25 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అవుతుంది. ఎక్కువగా మలబద్దకంతో బాధపడే వారు ఫైబర్ ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ఈ క్రమంలోనే వారికి గోధుమ పిండితో చేసిన రొట్టెలు, గోధుమ బ్రెడ్, నట్స్, ఆకుపచ్చని కూరగాయలు వంటివి మేలు చేస్తాయి. టాయిలెట్ సీట్‌పై కూర్చునే విధానంలో కూడా మల విసర్జన సాఫీగా జరగడం ఆధారపడి ఉంటుంది. సీట్‌పై గుంజీలు తీసినట్టు కూర్చోవాలి. అప్పుడే సరైన భంగిమ ఏర్పడి విరేచనం సులువుగా అవుతుంది. నీటిని ఎక్కువగా తాగాలి. తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా మలబద్దకం సమస్య కూడా వస్తుంది. అందుకే నీరు ఎక్కువగా తాగితే విరేచనం కూడా సాఫీగా జరుగుతుంది.
కాఫీ తాగితే సులువుగా విరేచనం జరుగుతుందట. సో, రోజుకో కప్పు కాఫీ తాగితే మలబద్దకం సమస్య కూడా ఉండదు. నడకతో కూడా మల విసర్జన సాఫీగా జరిగేలా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే అంత సులువుగా విరేచనం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కూర్చోవడం మాని ఎక్కువగా నడవండి. పొట్టను సున్నితంగా మసాజ్ చేసినా విరేచనం సులువుగా జరుగుతుంది. ఇక ముందెప్పుడైనా విరేచనం సమస్యగా ఉంటే ఈ ట్రిక్‌ను ఫాలో అయి చూడండి. ఫలితం కనిపిస్తుంది. ప్రూన్స్ అనే ఓ రకమైన పండ్లలో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మల విసర్జన సాఫీగా, సులువుగా జరిగేలా చేస్తాయి. ఈ పండ్ల జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది. ఇలా మలబద్దకం సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.