వినోదం

Sr NTR : రాముడు అనే పేరు వచ్చేలా ఎన్‌టీఆర్ చేసిన సినిమాలు ఇవే.. వాటిల్లో ఏవి హిట్ అయ్యాయంటే..?

Sr NTR : విశ్వ‌విఖ్యాత న‌టసార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌నా ప్ర‌తిభ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు. న‌ట‌న‌పై ఆయ‌న‌కున్న మ‌క్కువ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. అలానే రాముడు అనే పేరు వ‌చ్చేలా 15 సినిమాలు చేశారు. అవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాలే సాధించాయి.

ఎన్టీఆర్ హీరోగా రాముడు అనే పేరుతో వ‌చ్చిన తొలి సినిమా అగ్గి రాముడు. 1954 ఆగ‌స్టు 05న విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో హిట్‌గా నిలిచింది. ఇక త‌ర్వా చిత్రం శ‌భాష్ రాముడు. ఈ సినిమా 1959 సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల అయింది. ఫ‌లితం ఇది హిట్‌గానే నిలిచింది. అనంత‌రం బండ రాముడు చేశాడు. 1959 న‌వంబ‌ర్ 06న పుల్ల‌య్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా యావ‌రేజ్‌గా ఆడింది. ఇక 1961లో అక్టోబ‌ర్ 18న విడుద‌లైన టాక్సీ రాముడు సూప‌ర్ హిట్‌గా నిలిచింది. సీ.ఎస్‌.రావు ద‌ర్శ‌క‌త్వంలో 1962 మార్చి 08న విడుద‌లైన టైగ‌ర్ రాముడు కూడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

sr ntr ramudu only movie titles

రాముడు భీముడు అనే చిత్రం 1964 మే 21న విడుద‌ల కాగా, ఇది బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇక 1966 సెప్టెంబ‌ర్ 10న బి.విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా పిడుగు రాముడు సినిమా విడుద‌లైంది. ఇది కూడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. 1975 జూన్ 12న రాముని మించిన రాముడు సినిమా విడుద‌లైంది. ఈ సినిమా యావ‌రేజ్‌గా ఆడింది. కే.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అడ‌వి రాముడు 1977లో విడుద‌లై క‌నివిని ఎరుగ‌ని రీతిలో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇక డ్రైవ‌ర్ రాముడు అనే పేరుతో రాఘ‌వేంద్ర‌రావు సినిమా తీయ‌గా 1979 ఫిబ్ర‌వ‌రి 02న విడుద‌ల అయి సూప‌ర్ హిట్ గా నిలిచింది.

ఇక శృంగార రాముడు చిత్రం యావ‌రేజ్ గానే న‌డవ‌గా, ఛాలెంజ్ రాముడు సూప‌ర్ హిట్ అయింది. స‌ర్క‌స్ రాముడు, స‌ర‌దా రాముడు యావ‌రేజ్‌గా ఆడ‌గా, ఎన్టీఆర్ న‌టించిన క‌లియుగ రాముడు మాత్రం మంచి హిట్ అయింది. ఇలా రాముడు అనే పేరుతో వ‌చ్చిన సినిమాల‌తో ఎన్‌టీఆర్ చాలానే హిట్లు కొట్టారు. ఆయ‌న‌కు రాముడు అనే పేరు క‌ల‌సి వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts