వినోదం

థియేట‌ర్‌లో 1000 కి పైగా రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

ఒక సినిమా థియేటర్లలో ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత ఎక్కువ కలెక్షన్లు సాధించుకోవడంతో పాటు సినిమాకు భారీ లాభాలు వచ్చి సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఆ విధంగా 100 రోజులు ఆడిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో కోకొల్ల‌లు ఉన్నాయి. 175, 250 రోజులు 500 రోజులు ఆడిన చిత్రాలు కూడా మన తెలుగు పరిశ్రమలో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అన్ని రంగాల మాదిరిగానే తెలుగు సినిమా రంగంలో కూడా అనేక మార్పులు రావడంతో ఇప్పుడు ఒక వారం మాత్రమే సినిమా ఆడడం గగనం అయిపోయింది. కానీ గతంలో ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఆడింది అన్నదానిపై సినిమా హిట్ ని పరిగణిస్తారు.

ఎంత బడ్జెట్ పెట్టారు ఎంత ఎంత వసూలు చేసింది అనేది ప్రతి ఒక్కటి కూడా ఎన్ని రోజులు ఆడింది అనేదానిపై డిసైడ్ అవుతుంది. ఇప్పుడు గట్టిగా 10 రోజులు మహా అయితే 50 రోజులు మాత్రమే సినిమా ఆడటం కష్టంగా మారింది. అలాంటి మన టాలీవుడ్ లో 1000 రోజులు ఆడిన సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సి.పుల్లయ్య ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లవకుశ సినిమా అప్పట్లో 1111 రోజులు థియేటర్లలో ఆడ‌డం రికార్డును క్రియేట్ చేసింది. అక్కినేని నాగేశ్వరరావు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాంబోలో తెరకెక్కిన ప్రేమాభిషేకం సినిమా కూడా 300 రోజులు ఆడి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఓ థియేటర్ లో ఏకంగా 533 రోజులు ఆడింది.

these telugu movies played upto 1000 days in theatres

ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన వేటగాడు మూవీ కూడా 408 రోజులు ఆడింది. అలాగే అడవి రాముడు కూడా 365 రోజులు ఓ థియేటర్ లో ప్రదర్శించారు. 1983 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమసాగరం సినిమా 465 రోజులు ఆడింది. బాలయ్య నటించిన లెజెండ్ ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో 1005 రోజులు ఆడింది. మంగమ్మగారి మనవడు 557 రోజులు, మరోచరిత్ర 465 రోజులు, మగధీర 1001 రోజులు, పోకిరి 1001 రోజులు ఆడింది.

Admin

Recent Posts