వినోదం

Actor Rajendra Prasad : ఆ సినిమా క‌న్నా సీరియ‌ల్ బెట‌ర్ అన్నారు… కానీ సూప‌ర్ హిట్ అయిన రాజేంద్ర ప్ర‌సాద్ సినిమా ఇదే..!

Actor Rajendra Prasad : ఒక‌ప్పుడు హీరో క‌మ్ క‌మెడీయ‌న్‌గా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు రాజేంద్ర‌ప్ర‌సాద్. ఆయ‌న సినిమాల‌కి విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది. అయితే వ‌య‌స్సు పెరిగాక హీరోగా త‌ప్పుకున్న రాజేంద్ర ప్ర‌సాద్ స‌పోర్టింగ్ పాత్ర‌లు అలానే కీల‌క‌మైన పాత్ర‌లు పోషించాడు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో.. వచ్చిన ఒక గొప్ప సందేశంతో వచ్చిన ఆ నలుగురు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. . ఈ సినిమా 2004లో వచ్చిన ఓ ప్రత్యెక సినిమా. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన నంది ఉత్తమ చిత్రం ఇది.

పరుల సేవయే పరమార్థంగా భావించే రఘురాం పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించారు. తను చనిపోయిన తరువాత తన కోసం కుటుంబ సభ్యులు ఎలా బాధ పడతారో చూడాలని ఆ యమ కింకరులను వేడుకుంటాడు. తన శవం పట్ల అతని కన్న బిడ్డలే చూపిన నిర్లక్ష్యం పట్ల యమకింకరులు అతన్ని హేళన చేస్తారు. కానీ బతికి ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేసిన రఘురాంకు నివాళులు అర్పించేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతారు. అతని దగ్గర సహాయం పొందిన వారు అతని కొడుకులకు కూడా బుద్ధి చెపుతారు. అప్పుడు రఘురాంకు తనతో పాటు ఉన్న వారు యమ కింకరులు కారనీ, ప్రశాంతత చెందిన మనస్సుతో చూస్తే వారు దేవదూతలౌతారని తెలుసుకుంటాడు.

this rajendra prasad movie got super hit after first talk

ఆ దేవ దూతలు రఘురాంను స్వర్గానికి కొనిపోవడంతో కథ ముగుస్తుంది.అయితే డబ్బు కన్నా మానవతా విలువలు ప్రధానం అని చెప్పేలా ఒక స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు.దీనికి అంతిమయాత్ర అని పేరు కూడా పెట్టడం జరిగింది.ఆ తర్వాత ఈ కథతో సీరియల్ తీయవచ్చని ఈటీవీ కి పంపించడం జరిగింది.వారు సీరియల్ గా రిజెక్ట్ చేయడంతో అదే కథను కాస్త డెవలప్ చేసి భాగ్యరాజా దగ్గరకు తీసుకువెళ్లడం జరిగింది.అయితే ఈ సినిమాకు మోహన్ బాబు అయితే బాగుంటుంది అనుకున్నారు కాని ఇదే కథను ప్రకాష్ రాజ్ కు వినిపిస్తే కథ బాగుంది కానీ సినిమా గా పనికి రాదు అని రిజెక్ట్ చేయడం చేశారు. చంద్ర సిద్ధార్థ్ కు ఈ కథను వినిపించగా ఆయన తానే నిర్మిస్తాను అని చెప్పారు..ఈ సినిమా కథను రాజేంద్ర ప్రసాద్ కు చెప్పగా అయ్యన కన్నీళ్లు పెట్టుకొని భావోగ్వేదానికి గురయ్యారు. అలా ఆయ‌న ఒకే చ‌చెప్ప‌డం మిగ‌తా టెక్నీషియ‌న్స్ ఓకే కావ‌డం సినిమా తెర‌కెక్కి హిట్ కావ‌డం జ‌రిగింది.

Admin

Recent Posts