వినోదం

“సర్కారు వారి పాట” సినిమా ఫ్లో ను, దెబ్బతీసిన సన్నివేశం గురించి తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన హిట్ సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా భారీ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్ వారి పాట’ మూవీ మొదట ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రం టేకింగ్ విషయంలో దర్శకుడు పరశురాం చాలా తప్పులు చేశాడు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకు నుండి తీసుకొని ఎగ్గొట్టిన రుణాలు హీరో ఎలా తిరిగి కట్టిస్తాడు. అని కథలోకి దూరుతున్న సమయంలో హీరోకి తోడు లేక నిద్రలో కాలు వేసుకోవడానికి ఎవరూ లేక హీరోయిన్ ని ఇంట్లో ఉంచుకొని తెల్లవారుగానే పంపించే సన్నివేశం. ఈ మొత్తం ఎపిసోడ్ ఒక పది నిమిషాలు ఉంటుంది.

this scene breaks flow in sarkaru vari pata movie

ఇది కామెడీ సీన్ కాదు, ఎవ‌రికీ నవ్వు రాలా, పోనీ లవ్/ రొమాంటిక్ సీన్ అంతకన్నా కాదు, ఆ భావనే కలగలేదు. ఒకటో రెండో సార్లు చూపించినా ఏమైనా బాగుండేదేమో. ఎప్పుడూ అలసిపోయి స్టోరీలోకి వెళ్తారా అని చిరాకేసింది. అదేదో సినిమా అంతా అయిపోయాక ఆఖరికి ఎడిటింగ్ టేబుల్ లో కూర్చొని ఇదేంటి ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ ని మర్చిపోయాం, అని గుర్తు చేసుకొని ఎలాగోలా ఈ ఫ్లో లో హీరోయిన్ ని ఇరికిద్దాం అని ఈ సీక్వెన్స్ రాసుకొని ఫ్యాన్స్ కోసం మ.. మ.. మహేశా పాట పెట్టారా అనిపిస్తుంది. ఈ సీన్ సినిమా ఫ్లోను దెబ్బ తీసింద‌ని నెటిజన్లు అంటున్నారు.

Admin

Recent Posts