వినోదం

వెంకటేష్ పెద్ద కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెను ఎప్పుడైనా చూశారా..?

విక్ట‌రీ వెంక‌టేష్ ఫ్యామిలీ గురించి ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు. ఆయ‌న పెద్ద కూతురు ఆశ్రిత‌కి ఇప్ప‌టికే పెళ్లి కాగా, ఆమె సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది. ఇటీవ‌ల ఆశ్రిత దగ్గుబాటి.. యువసామ్రాట్ నాగ చైతన్యను బావా అని పిలుస్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోని అక్కినేని – దగ్గుబాటి ఫ్యాన్స్ నెట్టింట తెగ ట్రెండ్ చేసారు.చైతు, ఆశ్రితల బాండింగ్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేసారు… యూకేలో చదువుకున్న ఆశ్రిత.. తమ ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తను మాత్రం అందరి కంటే భిన్నంగా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ అయింది.

ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానెల్స్ రన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవ‌ల నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న ‘షోయూ’లో సందడి చేసింది. ‘ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షో యూ విత్ మై బావ’ అనే క్యాప్షన్‌తో 24:30 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో షేర్ చేసింది.. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఆమెను 258K మంది ఫాలో అవుతున్నారు..త‌న‌ పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ అన్నీ షేర్ చేస్తుంటుంది.. 2019లో ఆశ్రిత, వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది.

venkatesh daughter ashritha photos viral on social media

అశ్రిత పెళ్లిని రాజ‌స్తాన్‌లో అంగరరంగ వైభవంగా చేసాడు వెంక‌టేష్‌. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది. రాజస్థాన్‌లో బాలీవుడ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ సహా, టాలీవుడ్‌కు రామ్ చరణ్ సహా చాలా మంది ఈ పెళ్లి వేడుకలో సందడి చేసారు. ఇక‌ హైదరాబాద్‌లో జరిగిన కూతురు రిసెప్షన్ వేడుకకు చిరంజీవితో పాటు రాధిక, సుహాసిని వంటి అలనాటి నటీనటులతో పాటు అప్ప‌టి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. తాజాగా ఆశ్రిత పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Admin

Recent Posts