వినోదం

సినిమాల్లో సరదాగానే ఉన్నా నిజ జీవితంలో జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉండే కొన్ని సంఘటనలు ఏమిటి?

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి వాటిని దాటుకుంటూ కొత్త కొత్త ప్రయాణాలు చేస్తుంటారు ముఖ్యంగా యుక్త వయసులో చాలా రకాల అనుభవాలను (చదువు, స్నేహం, ప్రేమ, పెళ్లి , ఉద్యోగం)చూసుంటారు ఆ క్రమంలో ఒకసారి కొంత మందికి కొన్ని ఎదురు దెబ్బలు , ఆటంకాలు ఎదురవడం, ఇంట్లో పరిస్థితులు బాగొలేకపోవటం జరుగుతుంది దాని వలన కొన్ని ఇబ్బందులు పడుతుంటాం. ప్రతి వారికి ఏదో ఒక సంఘటన ఐతే జరుగి ఉంటుంది. నేను సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు నాకు చాలా సరదాగా అనిపించాయి కానీ నిజ జీవితంలో అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అలా సినిమాల్లో నాకు కనిపించిన కొన్ని సంఘటనలు.

ఆడ‌వారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో అప్లికేషన్ ఫామ్ కోసం వాళ్ళ నాన్నని డబ్బులు అడగడం కొన్ని సంభాషణలు చూడటానికి సరదా అనిపిస్తాయి కానీ కొంత మంది చాలా ఇబ్బంది పడతారు ఈ పరిస్థితిలో ఉంటే నిజంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాల్లకైతే ఆ ఇబ్బంది చాలా రకాలుగా ఉంటుంది( ఉదా: అడగలేకపోవడం , తప్పనిసరిగా అడగాల్సిందే అనేలా కొన్ని సందర్బాలు) తండ్రుల కైతే చెప్పలేం చాలా రకాల ఆలోచనలు తమ పిల్లలు ఎలాగోలా బాగుపడాలి అని. ఒక్కొక్కరిది ఒక్కొరకమైన తల్లి ప్రేమ , తండ్రి ప్రేమ కనబడుతుంది వాళ్ళు తిట్టిన అవి వినడానికి కష్టంగా అనిపించిన మన మంచికే అని మనకి మెల్లగా అయినా తెలుస్తుంది.

what are the scenes those are good in cinema but not in real life

ఇంకా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఒకటి. ఇందులో ఉద్యోగం గురించీ అందరూ ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అని అడగడం ఇది నిజ జీవితంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా పెళ్లి గురించి అయిన అంతే. మల్లీశ్వరి చిత్రంలో పెళ్లి కాలేదని పెళ్లి కాని ప్రసాదు అని పిలవడం ఇదంతా చూడ్డానికి సరదాగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఇబ్బందే ఎందుకంటే వీటికి సంబంధించి వారి వద్ద సరైన సమాధానం ఉంటుంది కానీ వినడానికి ఎవరు ఇష్టపడరు ఒకవేళ వినినా ఇలా ఉండొచ్చు కదా చెయ్యొచ్చు కదా అని సలహాలతో ఇబ్బంది పెడతారు ఆ సలహాలు ఆచరించదగినవిగా , ఆలోచించదగినది గా వాళ్ళకి ఉపయోగ పడేవిగా ఉండదు.

ఇంకొకటి కూడా ఉంది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో.. తాను పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయితో engagement రిజెక్ట్ అవుతుంది . కానీ ఆ అమ్మాయి పెళ్ళికే వెళ్లి అక్కడి పనులు చూస్కుంటుంటే ఇబ్బందిగా ఉంటుంది. సినిమా లో సరదాగానే అనిపించింది.

Admin

Recent Posts