వినోదం

బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?

మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం పాత్ర లేని సినిమా అంటూ ఉండదు. గత ఐదు సంవత్సరాల క్రితం ఏ సినిమాలోనైనా ఈయన కామెడీ లేకుండా సినిమాలే వచ్చేవి కావు. చాలా మంది దర్శక, నిర్మాతలు కూడా తప్పక బ్రహ్మానందం కామెడీ కావాలని డేట్స్ కోసం వేచి చూసి మరీ సినిమాల్లో పెట్టుకునేవారు. ముఖ కదలికలతోనే కామెడీని చూపించే శక్తి ఉన్న స్టార్ కమెడియన్ ఆయన. అయితే బ్రహ్మానందం పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలప్రగడ జనార్దన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చాలా ఏళ్ల క్రితం సినిమాల్లో అందరూ కమెడియన్స్ కి మంచి అవకాశాలతో ఈవీవీ, జంధ్యాల గారి సినిమాల వల్ల ఎంతోమంది కమెడియన్స్ వచ్చారన్నారు. అలాంటి సమయంలోనే బ్రహ్మానందంతో క్లాష్ వచ్చి వారందరూ కలిసి 20 మంది కమెడియన్స్ ఏవీఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి నేను వెళ్లలేదు.

what is the quarrel between brahmanandam and avs

ఆ తర్వాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో బ్రహ్మానందం కనిపించి మీటింగ్ కీ నువ్వెందుకు వెళ్లలేదు అని అడిగారు. నిజానికి చెప్పాలంటే నన్ను అసలు ఎవరు పిలవలేదు. ఒకవేళ పిలుచుంటే వెళ్లే వాడినేమో తెలియదు. ఆ మీటింగ్ కి మీతో గొడవ జరిగిన వాళ్ళు వెళ్లారు. నాకు నీతో గొడవ ఏం లేదు కాబట్టి నన్ను పిలవలేదేమో అని నిర్మోహమాటంగా చెప్పడంతో బ్రహ్మానందం అది నిజమేలే అని అన్నారు. అని ఆ గొడవ గురించి జెన్నీ చెప్పారు. ఇక ఆ గొడవ చిరంజీవి వద్దకు వెళ్ళింది. ఆయన సర్దుబాటు చేసి మీడియా వరకు వెళ్లకండి అని నచ్చజెప్పడంతో సద్దుమణిగింది అంటూ చెప్పారు.

Admin

Recent Posts