వినోదం

Gopichand : ఒక్క‌డు లాంటి బ్లాస్ బ‌స్ట‌ర్‌లో న‌టించే అవ‌కాశం గోపీచంద్‌కి వ‌చ్చినా.. మిస్ చేసుకున్నాడా..?

Gopichand : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక్క‌డు కూడా ఒక‌టి. ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఒక్క‌డు సినిమాకు చాలా ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. హీరోగా అత‌డి ఇమేజ్‌, స్టార్‌డ‌మ్‌ను రెట్టింపు చేసిన సినిమాల్లో ఒక్క‌డు కాగా, ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ స్టోరీగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈసినిమాను తెర‌కెక్కించాడు. ఇందులో క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా మ‌హేష్ యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. 2003 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా చాలా పెద్ద హిట్‌గా నిలిచింది.

ప‌ద‌మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఒక్కడు సినిమా న‌ల‌భై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఆ స‌మ‌యంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన తెలుగు సినిమాగా రికార్డుల‌కి ఎక్కింది..

why gopi chand rejected okkadu movie chance

అయితే అస‌లు ఒక్క‌డులో గోపిచంద్ కి న‌టించే అవ‌కాశం రాగా, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ‘అలీతో సరదాగా’ అనే షోలో పాల్గొన్నాడు గోపిచంద్ . ఆ షోలో గోపీచంద్ మాట్లాడుతూ.. త‌న‌కి ‘ఒక్కడు’ సినిమాలో కూడా అవకాశం వచ్చిందని అన్నాడు. ఆ సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ ప్లేస్ లో గోపీచంద్ ను కూడా అడిగారట. ఆ టైంలో ప్రకాష్ రాజ్ కాల్షీట్లు బిజీగా ఉండడం వలన గోపీచంద్ ను సంప్రదించిందట ‘ఒక్కడు’ యూనిట్. దర్శకుడు గుణశేఖర్.. గోపీచంద్ కు తన పాత్ర గురించి కూడా చెప్పారట. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్.. ‘నేను డేట్స్ అడ్జస్ట్ చేస్తాను’ అని చెప్పడంతో ప్రకాష్ రాజ్ నే ఫైనల్ చేశారు అని గోపీచంద్ తెలిపాడు.

Admin

Recent Posts