చాలామంది కథానాయకులకు ఈ పరిస్థితి వస్తుంది.రవితేజకు ఇది రెండవ విడత పరాజయ అనుభవం. గతంలో బలుపు సినిమా కంటే ముందుగా 6,7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా 6,7 సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయిన మరో నటుడు కూడా వున్నాడు. సినిమాకు హీరో story, స్క్రిప్ట్. రవితేజకు హీరోగా late entry. చాలా విజయాలు నమోదు చేసుకున్న హీరో. ఇడియట్, విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, వెంకీ, కిక్ , దుబాయి శీను, డాన్ శీను లాంటి సినిమాలతో ఇప్పుడు వచ్చే సినిమాలను పోల్చుకుంటారు. అయినా సినిమాలలో up and downs సహజం. ఈ రెండు సంవత్సరాలలో పరాజయాలు ఎక్కువగా నమోదు అయ్యాయి. కథలో బలం వుంటే తప్ప ఈ కాలంలో సినిమాలు ఆడడం లేదు. కేవలం ఫ్యాన్స్ చూస్తేనే డబ్బులు, విజయం దక్కే రోజులు కావిప్పుడు.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోల కొరత బాగా వున్నది. 40, 30, 25, 20 సంవత్సరాలు నుంచి నటిస్తున్న హీరోలను ఇంకా హీరోలుగా చూడలేక పోతున్న ప్రేక్షకులు. వయసు పెరుగుతున్నప్పుడు గ్లామర్ తగ్గుతుంది. కొందరు హీరోలు బాగా డైటింగ్ చేయడం వల్ల ముఖం చాలా మారిపోయి గుర్తుపట్టలేని రీతిగా మారుతుంది. హీరోకి అందం ముఖ్యమైన అంశం .ప్రేక్షకులు పోల్చుకుంటారు. ఈ కాలంలో సంవత్సరానికి 30% సినిమాలే విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. హీరోకి డిమాండ్ తగ్గితే నిర్మాతలు కూడా ధైర్యంగా ముందుకు రారు. హీరోకు వయసు పెరగడం కూడా ఆదరణ తగ్గడానికి ముఖ్య కారణం. ఇది గొప్ప గొప్ప హీరోలకూ వర్తిస్తుంది. తెలుగులో పేరున్న నటుల సినిమాలు కొన్ని ఆడితే కొన్ని ఓడుతున్నాయి.
క్రొత్త నీరు రావడం ప్రతి రంగంలో సహజం. డిమాండ్ తగ్గుతున్న హీరోలు క్రమేణా పోటీ నుండి ప్రక్కకు పెట్టబెడతారు. సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో గట్టి, మంచి ఎలిమెంట్ లేకుంటే సినిమా హాల్ కు రారు. హీరోల రెమ్యునరేషన్ ఓ పద్ధతి లేకుండా పెరగడం ప్రధాన కారణం. సినిమా పక్కా కమర్షియల్. ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన ఎలిమెంట్స్ సినిమాలో వుండాలి. suspense, twist, మంచి పాటలు, లొకేషన్స్ ఇత్యాదివి సినిమాలో వుండాలి. ఇప్పుడు జోష్, జోరు, కంటి చూపులో Power, సమ్మోహన శక్తి వున్న హీరోలకే డిమాండ్. అవి తగ్గిన హీరోలకు మార్కెట్ తగ్గిపోతున్నది. ఒక్క రవితేజకు మాత్రమే ఈ పరిస్థితి కాదు. మనం ఎంతో మంది ఇతర పాత హీరోల పరిస్థితి ఇలాగే వుండడం చూస్తున్నాం.
సినిమాలు సరిగా ఆడని హీరో విషయంలో మొదట నిర్మాత నష్టపోతారు. పదేపదే failures నమోదు చేస్తున్న Hero కు క్రమేణా market తగ్గిపోయి ఇతర characters వేసుకోవాల్సి వస్తుంది. ప్రతి హీరో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రేక్షకుడి నాడి సరిగా పట్టుకోవడం అతి కష్టం. నేల టికెట్, disco రాజా సినిమాలు కాస్త ఫర్వాలేదు. అయినా హిట్ అవలేదు. రామారావు ఆన్ డ్యూటీ సినిమా సరిగా ఆడలేదు. ధమాకా సినిమా ఫర్లేదు. ఈ కాలంలో హీరోలు కేవలం సినిమా ఆదాయం మీదే కాకుండా real estate, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్, స్టూడియోలు, function halls, pubs లాంటివి ఏర్పాటు చేసి అదనపు ఆదాయంతో safe గా వుంటున్నారు. ఎటొచ్చీ నిర్మాతలకే risk ఎక్కువ.