వినోదం

Sr NTR : య‌మ‌గోల మూవీ నుంచి బాల‌కృష్ణ‌ను త‌ప్పించి హీరోగా న‌టించిన ఎన్టీఆర్.. ఎందుకలా చేశారంటే..?

Sr NTR : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగాడు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యాడు. మనం ఎవరం రాముడు, కృష్ణుడిని చూడలేదు కానీ రామరావులో దేవుడిని చూసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. దానవీర శూరకర్ణలో 3 పాత్రలు, 5 విభాగాల్లో పని చేసి అందరిని అలరించారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఎన్టీ రామారావు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్టీ రామారావు చేసిన విభిన్నమైన సినిమాల్లో యమగోల సినిమా ఒకటి.

1977వ సంవత్సరంలో తాపీనేని రామారావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాను బెంగాలీలో తెరకెక్కిన యమాలయే మానుష్ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీరామారావు హీరోగా నటించగా యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ నటించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో బాలకృష్ణను హీరోగా అనుకున్నారు. అంతేకాకుండా కైకాల సత్యనారాయణ చేసిన పాత్ర‌లో ఎన్టీ రామారావు నటించాల్సి ఉంది. కానీ అప్పటికే ఎన్టీరామారావు యముడి పాత్రలో దేవాంత‌కుడు అనే సినిమా వచ్చింది.

why sr ntr removed balakrishna from yamagola

ఈ సినిమాకు పుల్ల‌య్య‌ దర్శకత్వం వహించారు. దేవాంతకుడు సినిమాలో ఎన్టీఆర్ హీరోగా చేయడం వల్ల యమగోల కూడా అదే టైప్ సినిమా కాబట్టి బాలకృష్ణను హీరోగా పెట్టి తీయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కు బాలకృష్ణ సొంత బ్యానర్ లో తప్ప ఇతర బ్యానర్ ల‌లో సినిమాలు చేయడం ఇష్టం లేదు. ఈ ఒక్క‌ కారణం వల్లే ఎన్టీఆర్ బాలకృష్ణను యమగోల ప్రాజెక్ట్ నుండి తప్పించారు. అంతేకాకుండా నటుడు కైకాల సత్యనారాయణను యముడి పాత్రలో తీసుకోవాలని కూడా ఎన్టీఆర్ గారే సూచించారు. ఇక అలా బాలకృష్ణ హీరోగా చేయాల్సిన య‌మ‌గోల సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్నారు.

Admin

Recent Posts