Walking In Winter : వాకింగ్.. మనం సులభంగా చేసుకోదగిన వ్యాయామాల్లో ఇది కూడా ఒకటి. మనలో చాలా మంది రోజూ వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్, గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వాకింగ్ చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాకింగ్ చేయడం వల్ల ఇలా అనేక రకాలుగా మనం ప్రయోజనాలను పొందవచ్చు. అయితే చలికాలం రాగానే చాలా మంది వాకింగ్ చేయడం తగ్గిస్తారు. చలికాలంలో ఉండే తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా, బద్దకం కారణంగా, చలి కారణంగా ఉదయం నిద్ర లేవకపోవడం, పొగమంచు ఇలా అనేక కారణాల చేత చాలా మంది చలికాలంలో వాకింగ్ చేయడం మానేస్తూ ఉంటారు.
కానీ చలికాలంలో తప్పకుండా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చలికాలంలో తప్పకుండా వాకింగ్ చేయాలని చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి మరితంగా మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనే సమస్య బారిన పడకుండా ఉంటాము. వాకింగ్ చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మానసిక స్థితి మెరుగుపడుతుంది.
ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే వాకింగ్ చేయడం వల్ల బరువు పెరగకుండా ఉంటాము.చలికాలంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వాకింగ్ చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే చలికాలంలో శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. కనుక వాకింగ్ చేయడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల బారిన పడకుండా ఉంటాము.
వాకింగ్ చేయడం వల్ల గుండెపనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్, బీపీ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే చలికాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎముకలు విరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల ఎముకల సాంధ్రత పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. నొప్పులు తగ్గుతాయి. అలాగే వాకింగ్ చేయడం వల్ల నిద్రలేమి తగ్గుతుంది. రాత్రి పూట చక్కగా నిద్రపడుతుంది. అలాగే చలికాలంలో మధ్యాహ్న సమయంలో నడవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. దీంతో ఎముకలు ధృడంగా తయారవుతాయి. చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల ఇలా అనేక రకాలుగా మనకు మేలు కలుగుతుందని కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తప్పకుండా చలికాలంలో కూడా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.