Aloo Kurkure : చిప్స్ షాపుల్లో ల‌భించే ఆలు కుర్‌కురే.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Aloo Kurkure : మ‌నం బంగాళాదుంప‌ల‌తో అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన స్నాక్ ఐట‌మ్స్ లో ఆలూ కుర్ కురే కూడా ఒక‌టి. ఈ ఆలూ కుర్ కురే చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. పార్టీ టైమ్ లో స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఇవి 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ ఆలూ కుర్ కురేల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ కుర్ కురే త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – కిలో, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, వేయించిన జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Aloo Kurkure recipe very tasty snacks to make
Aloo Kurkure

ఆలూ కుర్ కురే త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌పై ఉండే చెక్కును తీసేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. త‌రువాత వీటిని స్లైసెస్ గా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఈ స్లైసెస్ ను ఒక‌దాని మీద ఒక‌టి ఉంచి అన్ని స‌మానంగా వ‌చ్చేలా స్ట్రిప్స్ లాగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిని నీటిలో వేసి 3 నుండి సార్లు బాగా క‌డ‌గాలి. త‌రువాత నీరు లేకుండా పూర్తిగా వ‌డ‌క‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి బాగా కోట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప స్ట్రిప్స్ ను వేసి వేయించాలి. వీటిని పెద్ద మంట‌పై లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న వీటిపై అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ చాట్ మ‌సాలా చ‌ల్లుకుని అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఆలూ కుర్ కురే త‌యార‌వుతుంది. వీటిని చ‌ల్లారిన త‌రువాత డ‌బ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసిన ఆలూ కుర్ కురేల‌ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts