Categories: Featured

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను ఏయే స‌మ‌యాల్లో చేస్తే మంచిది ?

ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో స‌గ‌టు పౌరుడు నిత్యం అనేక ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నాడు. నిత్యం నిద్ర లేచింది మొద‌లు స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. దీంతో స‌మ‌యానికి తిండి తిన‌డం లేదు. ఫ‌లితంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాడు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన సూత్రాల్లో ఒక‌టి.. నిత్యం స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌ల‌ను స‌మ‌యానికి చేయాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే ఆయా ఆహారాల‌ను ఏయే స‌మ‌యాల్లో తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

breakfast lunch dinner correct time

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్

నిత్యం ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ను 7.00 నుంచి 8.00 గంట‌ల మ‌ధ్య‌లో పూర్తి చేయాలి.

మ‌ధ్యాహ్నం లంచ్

లంచ్‌ను రోజూ మ‌ధ్యాహ్నం 12 నుంచి 1 గంట మ‌ధ్య‌లో చేయాల్సి ఉంటుంది.

రాత్రి డిన్న‌ర్

రాత్రి డిన్న‌ర్‌ను 6 నుంచి 7.30 లోపు పూర్తి చేయాలి.

ఈ విధ‌మైన దిన‌చ‌ర్య‌ను పాటించ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని, అధిక బ‌రువు పెర‌గ‌కుండా ఉంటార‌ని డైటిషియ‌న్లు చెబుతున్నారు.

అయితే సాధార‌ణంగా చాలా మంది ఈ మూడు ఆహారాల‌ను స‌మ‌యానికి తీసుకోరు. చాలా ఆల‌స్యంగా బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్ చేస్తారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న వార‌వుతార‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు పైన తెలిపిన విధంగా క‌చ్చితంగా స‌మ‌యాన్ని పాటించాల‌ని సూచిస్తున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts