Health Tips : శృంగారంలో పాల్గొనేందుకు స‌రైన స‌మ‌యం ఏదో తెలుసా ?

Health Tips : శృంగారం అనేది రెండు శ‌రీరాల‌ను ఒక్క‌టి చేసే అత్యంత ప‌విత్ర‌మైన కార్య‌క్ర‌మం. అందువల్ల దాని గురించి మాట్లాడుకునేందుకు సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. భార్యాభ‌ర్త‌ల దాంప‌త్యం అన్యోన్యంగా ఉండాలంటే.. ఇద్ద‌రి మ‌ధ్యా అనేక బంధం బ‌లంగా ఉండ‌డంతోపాటు శృంగార జీవితం కూడా బాగుండాలి. అప్పుడే ఆ కాపురం స‌జావుగా సాగుతుంది. ప్రస్తుతం ఉరుకుల ప‌రుగుల యాంత్రిక జీవితం అయిపోయింది. దీంతో స‌గ‌టు జంట శృంగార జీవితానికి దూర‌మ‌వుతున్నారు.

Health Tips  what is the best time for srungaram

అయితే సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం కుదిరితే రోజూ శృంగారంలో పాల్గొనాలి.. లేదా వారంలో క‌నీసం 2, 3 సార్లు అయినా శృంగారంలో పాల్గొనాలి. దీంతో దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త పెరుగుతుంది. ఇక శృంగారంలో పాల్గొనేందుకు రోజులో ఉత్త‌మ‌మైన స‌మ‌యం ఏద‌ని.. కొంద‌రు సందేహిస్తుంటారు. మ‌రి అందుకు వైద్యులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారంటే..

తెల్ల‌వారుజామున 4-5 గంట‌ల స‌మ‌యంలో స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ శృంగారాన్ని ప్రేరేపించే హార్మోన్లు హెచ్చు స్థాయిలో ఉంటాయి. క‌నుక ఆ స‌మ‌యంలో శృంగారంలో పాల్గొంటే మంచిది. దీంతో దంప‌తులు చురుగ్గా శృంగారంలో పాల్గొంటారు. అన్యోన్య‌త పెరుగుతుంది. ఏమైనా శృంగార స‌మ‌స్య‌లు ఉంటే పోతాయి.

ఇక వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు శృంగారంలో పాల్గొనాలి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సైంటిస్టులు ఈ విష‌యాన్ని బ‌ల్లగుద్ది మ‌రీ చెబుతున్నారు. అలాగే స్త్రీల‌కు త‌మ రుతుక్ర‌మంలో 14, 15 రోజుల్లో శృంగారంలో పాల్గొంటే మంచిద‌ట‌. ఆ స‌మ‌యంలో వారిలో కామోద్దీప‌న‌లు బాగా ఉంటాయి. క‌నుక శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొన‌గ‌లుగుతారు. కాబట్టి దంప‌తులు ఆ రోజుల‌ను మిస్ చేసుకోకూడ‌దు.

ఇక వ్యాయామం చేసిన త‌రువాత స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. అందువ‌ల్ల ఆ స‌మ‌యంలోనూ శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు. యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

రోజంతా ఒత్తిడి అధికంగా ఫీలైన‌వారు, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌లో ఉన్న స‌మ‌యంలో, భ‌యానికి గురైన‌ప్పుడు శృంగారంలో పాల్గొంటే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ట‌. దీంతో మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇక ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం రాత్రి 8 నుంచి 10 గంట‌ల లోపు శృంగారంలో పాల్గొంటే మంచిద‌ట‌. అలాగే మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 గంటల స‌మ‌యంలో.. రాత్రి 11 నుంచి 12 గంట‌ల మ‌ధ్య కూడా మంచి స‌మ‌యాలేన‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక ఈ స‌మ‌యాల్లో శృంగారంలో పాల్గొంటే చురుగ్గా ఆ ప‌ని కానిచ్చేస్తారు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త, ఆప్యాయ‌త‌, ప్రేమ కూడా పెరుగుతాయి.

Admin

Recent Posts