Covid Cases Today : దేశంలో మ‌ళ్లీ భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్తగా ఎన్ని వ‌చ్చాయంటే..?

Covid Cases Today : దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగానే పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధ‌వారం వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,94,720 కేసులు న‌మోదు కాగా 60,405 మంది రిక‌వ‌రీ అయ్యారు. 442 మంది చ‌నిపోయారు.

Covid Cases Today new cases registered more in 24 hours

కాగా ప్ర‌స్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,319కి చేరుకుంది. పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరుకుంది. ఢిల్లీలో కొత్త‌గా 21,259 కేసులు న‌మోదు కాగా, ముంబైలో 11,647 కేసులు న‌మోద‌య్యాయి. మంగ‌ళ‌వారంతో పోల్చితే బుధ‌వారం న‌మోదు అయిన కేసుల సంఖ్య 15.8 శాతం ఎక్కువ‌గా ఉంది. దేశంలో 120 జిల్లాల్లో గ‌తం వారం రోజుల‌తో పోల్చితే ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 10 శాతం ఎక్కువ‌గా పెరిగింది.

దేశంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల శాతం 2.65 ఉండ‌గా.. రిక‌వ‌రీ రేటు 96.01 శాతంగా ఉంది. మొత్తం 3,46,30,536 మంది రిక‌వ‌రీ అయ్యారు. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతం ఉండ‌గా, వారం వారీ పాజిటివిటీ రేటు 9.82 శాతంగా ఉంది. ఇక మొత్తం పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 153.80 కోట్ల‌కు చేరుకుంది.

Admin

Recent Posts