Blood Purifying : క‌లుషిత‌మైన‌, ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చిన ర‌క్తాన్ని ఇలా శుద్ధి చేసుకోండి.. చాలా సుల‌భ‌మైన చిట్కాలు..!

Blood Purifying : రోజూ మ‌నం తీసుకునే ఆహారాల‌తోపాటు పాటించే అనేక అల‌వాట్ల వ‌ల్ల మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. ఇక కొంద‌రు వాడే ప‌లు ర‌కాల మందుల వ‌ల్ల కూడా శ‌రీరంలో వ్య‌ర్థాలు చేరుతుంటాయి. ఇవి ఎక్కువ‌గా లివ‌ర్‌తోపాటు ర‌క్తంలో ఉంటాయి. అయితే శరీరం ఆ వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతూనే ఉంటుంది. కానీ కొంద‌రిలో ఈ ప్ర‌క్రియ అంత సుల‌భంగా జ‌ర‌గ‌దు. దీంతో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. ఈ క్ర‌మంలోనే ర‌క్తం క‌లుషితం అయి ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి.

home remedies for Blood Purifying

మ‌న శ‌ర‌రీంలో ర‌క్తం ఆరోగ్యంగా ఉంటేనే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ర‌క్తం ద్వారా శరీర భాగాలు, క‌ణాల‌కు ఆక్సిజ‌న్‌, పోష‌కాలు స‌ర‌ఫ‌రా అవుతాయి. వాటి నుంచి వ్య‌ర్థాలు, కార్బ‌న్ డ‌యాక్సైడ్ బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌క్తం ద్వారా శ‌రీరం నుంచి బ‌య‌ట‌కు పోతాయి. అయితే ఈ ప్ర‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ర‌క్తాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..

1. శ‌రీరాన్ని అంత‌ర్గ‌తంగా శుభ్ర ప‌ర‌చ‌డంలో నిమ్మ‌ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఇది లివ‌ర్‌, ర‌క్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుండాలి. దీని వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. లివ‌ర్‌, రక్తం శుద్ధి అవుతాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా ఇలా చేస్తే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపి ర‌క్తాన్ని శుభ్ర ప‌రుచుకోవ‌చ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

2. రోజూ ఉద‌యాన్నే నాలుగైదు తుల‌సి ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటుండాలి. ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో తుల‌సి ఆకులు అమోఘంగా ప‌నిచేస్తాయి. తుల‌సి ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని కూడా రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చు. దీంతో వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

3. రాత్రిపూట ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని పాల‌లో పావు టీస్పూన్ ప‌సుపు క‌లిపి తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం బాగా పెర‌గ‌డంతోపాటు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్తంలోని మ‌లినాలు బ‌య‌ట‌కు పోతాయి.

4. రోజూ కొంద‌రు నీటిని స‌రిగ్గా తాగ‌రు. నీటిని రోజూ త‌గినంత మోతాదులో తాగితే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపే ప్ర‌క్రియ సుల‌భంగా జ‌రుగుతుంది. కాబ‌ట్టి రోజూ స‌రిపోయిన‌న్ని నీటిని తాగాలి. దీంతో ర‌క్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

5. రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు బీట్‌రూట్ ముక్క‌ల‌ను తినాలి. లేదా జ్యూస్ తాగ‌వ‌చ్చు. ర‌క్తాన్ని పెంచ‌డంలో బీట్ రూట్ అద్భుతంగా ప‌నిచేస్తుంది. అలాగే ర‌క్తంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి ర‌క్తం శుద్ధి అవుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి హైబీపీ త‌గ్గుతుంది.

6. బీట్‌రూట్ లాగే క్యారెట్ జ్యూస్ కూడా ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో బాగానే ప‌నిచేస్తుంది. ఇది లివ‌ర్ కు కూడా టానిక్ లా ప‌నిచేస్తుంది. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క్యారెట్ తిన‌వ‌చ్చు. లేదా ఒక క‌ప్పు జ్యూస్ తాగ‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

7. భోజ‌నం అనంత‌రం చిన్న బెల్లం ముక్క‌ను తినే అల‌వాటు చేసుకోవాలి. దీని వ‌ల్ల శ‌రీరానికి ఐర‌న్ బాగా ల‌భిస్తుంది. ర‌క్తం తయార‌వుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ర‌క్త శుద్ధి అవుతుంది. లివ‌ర్‌, శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌లు శుభ్రంగా మారుతాయి. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

Admin

Recent Posts