Jilledu : జిల్లేడు చెట్టులో ఉండే ఆరోగ్య రహస్యాలు.. ఎన్నో సమస్యలకు పనిచేస్తుంది..

Jilledu : మన చుట్టూ పరిసరాల్లో అనేక ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఔషధ గుణాలు ఉండే మొక్కల్లో జిల్లేడు ఒకటి. ఇది మన చుట్టూ, పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కనుక మనకు కలిగే వ్యాధుల నుంచి బయట పడవచ్చు.

amazing benefits of Jilledu

జిల్లేడులో పలు రకాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు అని ఉంటాయి. రథ సప్తమి రోజు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తే మేలు జరుగుతుందని చెబుతుంటారు. జిల్లేడు పువ్వులు లేదా ఆకులను సేకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి నుంచి పాలు వస్తాయి. అవి కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలి. అవి విష పూరితం. కనుక జిల్లేడు ఆకులు, పువ్వులను సేకరించేటప్పుడు పాలు కళ్లలో పడకుండా చూసుకోవాలి.

ఇక జిల్లేడు ఆకులను సేకరించి కొద్దిగా నీళ్లు కలిపి, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

జిల్లేడు ఆకులకు ఆముదం రాసి కీళ్ల నొప్పులు ఉన్న చోట కట్టుగా కడుతుండాలి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జిల్లేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి పుండ్లు, గాయాలపై రాయాలి. అవి త్వరగా మానుతాయి.

జిల్లేడు చెట్టు వేరును సేకరించి శుభ్రం చేసి రాత్రి నిద్రించే ముందు తలగడ కింద పెట్టుకోవాలి. దీంతో పీడకలలు రావు. భయం తగ్గుతుంది. దీని వల్ల గ్రహ దోషాలు ఉన్నా కూడా పోతాయి. అన్నీ శుభాలే కలుగుతాయి. సమస్యలు తొలగిపోతాయి.

తెల్ల జిల్లేడును సిరిసంపదలకు గుర్తుగా భావిస్తారు. అందుకనే కొందరు ఇళ్లలో ఇప్పటికీ ఈ మొక్కలను పెంచుతుంటారు.

జిల్లేడు ఆకులను సేకరించి పసుపు కలిపి నూరి మిశ్రమంగా చేసి రాస్తుంటే.. సెగ గడడ్లు, వేడి కురుపులు తగ్గిపోతాయి. అరికాళ్లు, చేతుల్లో బొబ్బలకు కూడా ఇది పనిచేస్తుంది.

జిల్లేడు పాలలో పసుపు కలిపి ముఖానికి రాస్తుంటే నల్లని మచ్చలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. జిల్లేడు పాలను తెగిన గాయాలపై రాస్తే రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది.

గజ్జల్లో బిళ్లలు కట్టినట్లు అవుతుంటే.. జిల్లేడు ఆకులకు ఆముదం రాసి వేడి చేసి కడుతుండాలి. బిళ్లలు పోతాయి.

జిల్లేడు వేరును కాల్చి దంతాలను తోముకోవడానికి కూడా కొన్ని చోట్ల ఉపయోగిస్తారు. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

జిల్లేడు ఆకుల పేస్ట్‌ను పాము కుట్టిన చోట రాసి కట్టుకడితే విష ప్రభావం తగ్గిపోతుంది. జిల్లేడు ఆకుల పొగను పీలిస్తే ఆస్తమా తగ్గుతుంది. అయితే జిల్లేడు ఆకులను వాడేటప్పుడు పాలు లోపలికి వెళ్లకుండా, కళ్లలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Admin

Recent Posts