Peanuts : ప్రస్తుతం మనకు తినేందుకు అనేక రకాల ఫుడ్ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పల్లీలు, బెల్లం ఒకటి. ఈ రెండింటినీ కలిపి తింటే వచ్చే మజాయే వేరు. కొందరు ఈ రెండింటినీ కలిపి తయారుచేసే పల్లి పట్టీలను ఎక్కువగా తింటారు. అయితే నేరుగా పల్లీలు, బెల్లం కలిపి కూడా తినవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన పోషక పదార్థం, బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు. పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేరుశెనగల్లో సెలీనియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి స్త్రీలు, పురుషుల్లో సంతాన లోపం సమస్యలను పరిష్కరిస్తాయి. అందువల్ల పల్లీలను బెల్లంతో కలిపి స్త్రీ, పురుషులు రోజూ తింటుంటే వారిలో ఉండే సమస్యలు తగ్గి వారికి సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. దీంతోపాటు కండరాలు దృఢంగా మారుతాయి. శరీరం ఉక్కులా మారి దృఢంగా ఉంటుంది. అమితమైన శక్తి లభిస్తుంది. ఎంత పని చేసినా అలసిపోరు. శారీరక దృఢత్వం లభిస్తుంది. అందువల్ల పల్లీలు, బెల్లం కాంబినేషన్‌ను అత్యంత బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు.
2. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది.
3. పల్లీలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే బెల్లంలో పొటాషియం, మెగ్నిషియం, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
4. ఈ రెండింటి మిశ్రమం ద్వారా శరీరానికి కాల్షియం అధికంగా లభిస్తుంది. దీంతో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
5. నెలసరి సమయంలో స్త్రీలకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు వేరుశెనగలను బెల్లంతో కలిపి తింటే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.
6. చలికాలంలో వేరుశెనగలు, బెల్లంను కలిపి తింటే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.