Kiwi : మనకు అందుబాటులో ఉన్న అనేక ఉత్తమమైన పండ్లలో కివీ పండు ఒకటి. ఇది పుల్లగా ఉంటుంది. పైనంతా పొట్టును కలిగి లోపల ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. అందువల్ల దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ కివీ పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక దీన్ని తింటే ఎలాంటి వ్యాధి అయినా సరే వెంటనే తగ్గుతుంది. కివీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చినవారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఈ పండ్లను తినడం వల్ల ప్లేట్‌లెట్లు కూడా త్వరగా పెరుగుతాయి.
కివీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చూస్తుంది. ఇంకా కివీ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే కివీ పండ్లను పొట్టుతో సహా తినవచ్చు. కానీ పొట్టు తినడం ఇష్టం లేని వారు దాన్ని తీసేసి తినవచ్చు. ఇక కివీ పండు పొట్టును కింద తెలిపిన విధంగా సులభంగా తీయవచ్చు. అదెలాగంటే..
కివీ పండును పైన కొంత భాగం కోయాలి. తరువాత మీద చిన్న గాటులా పెట్టాలి. అనంతరం లోపల స్పూన్ పెట్టి చుట్టూ పొట్టు కింద తిప్పుతూ ఐస్ క్రీమ్ తీసినట్లు తీయాలి. దీంతో కివీ పండు పొట్టు సులభంగా వస్తుంది. ఇలా కివీ పండును పొట్టు తీసి తినవచ్చు.
కివీ పండ్లను రోజుకు ఒకటి తింటే చాలు.. ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీటిని ప్రతి రోజూ మధ్యాహ్నం లంచ్ తరువాత 1 గంట విరామం ఇచ్చాక తినాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.