Samantha : సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ ఎవరు ? అనే ప్రశ్న వేస్తే.. అందుకు సమంత.. అని సమాధానం ఎవరైనా చెబుతారు. ప్రతి చిన్న విషయాన్ని సమంత అంతలా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె కేరళలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె నటించిన ఓ బేబీ అనే మూవీలో కో స్టార్ గా పనిచేసిన తేజ సజ్జా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. అందుకు సమంత ఫన్నీగా కామెంట్ చేసింది.
తేజ సజ్జా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు రెండింటిని పోస్ట్ చేశాడు. అయితే అందుకు సమంత కామెంట్ చేసింది. ఎక్స్‌క్యూజ్ మి లేడీస్.. అని తేజ సజ్జా కాప్షన్ పెట్టగా.. అంటే, కేవలం ఒక్క పిక్చరా, అంత ఈజీ అనుకున్నావా.. మనం అతనికి ఏమీ నేర్పలేదా.. అని సమంత కామెంట్ చేసింది. అందులో ఆమె ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డిని అడుగుతూ చివర్లో ఆమె పేరును టాగ్ చేసింది. దీంతో సమంత చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
ఇక సమంత నటించిన శాకుంతలం మూవీ ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. దీంతో తాను ఎగ్జయిటింగ్‌గా ఉన్నానని.. గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. సమంత తెలియజేసింది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో సమంత ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.