Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీకి చెందిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కు ఎంతో కిక్ ఎక్కిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్ బంపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ పాటకు అనేక మంది ఇప్పటికే డ్యాన్స్ చేసి తమ మోజు తీర్చుకున్నారు. తాజాగా మహేష్ బాబు కుమార్తె సితార కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసింది.
సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్ కు మహేష్ కుమార్తె సితార డ్యాన్స్ చేయగా.. ఆ వీడియోను మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. అచ్చం తండ్రిలాగే సితార డ్యాన్స్ చేసింది. ఆమె చేసిన డ్యాన్స్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ముచ్చటపడుతున్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేసిన మహేష్ దానికి కాప్షన్ కూడా పెట్టారు.
నువ్వు నా స్టార్ వి.. నువ్వు నన్ను బీట్ చేశావు.. అంటూ మహేష్ ఆ వీడియోకు కాప్షన్ పెట్టారు. వాస్తవానికి సితార ఆ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మూవీ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా.. దీన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ లు సంయుక్తంగా నిర్మించాయి. అలాగే పరశురామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.