food

Spicy Guava Juice : జామ‌కాయ‌ల‌తో ఇలా కార‌కారంగా జ్యూస్ చేసి తాగండి.. ఎంతో బాగుంటుంది..!

Spicy Guava Juice : జామ పండ్లని తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందవచ్చు. జామలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, రెగ్యులర్ గా చాలా మంది జామ పండ్లుని తింటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వాళ్ళు, రోజు జామ పండ్లను తీసుకోవడం మంచిది. జామ పండ్లను తీసుకుంటే, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పైగా, ఇవి మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతాయి. కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. పెద్దగా ఇబ్బంది ఉండదు.

ఆరోగ్యంగా ఉండడానికి, రోజు పండ్లు ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. పండ్లు కానీ పండ్లు జ్యూస్ లని కానీ ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, షుగర్ ఉన్న వాళ్ళకి, జామ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. స్పైసీగా కూడా మనం జామ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు. ఇక జామ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. దీని కోసం మీరు రెండు జామ పండ్లను తీసుకోండి.

guava juice make like this for taste

దానితో పాటు రెండు టేబుల్ స్పూన్లు చక్కెర, ఏడు వరకు పుదీనా ఆకులని తీసుకోండి. అలానే పింక్ సాల్ట్, జీలకర్ర పొడి, కారం, ఐస్ క్యూబ్స్ ని కూడా తీసుకోండి. పండిన జామ పండ్లను ముక్కలు కింద కోసుకుని, మిక్సీ జార్లో వేసుకోండి.

ఇందులో పంచదార, పుదీనా, పింక్ సాల్ట్, జీలకర్ర, కారం, ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గింజలు రాకుండా వడకట్టుకుని, ఒక గ్లాస్ లో పోసుకోండి. అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి పైన నిమ్మరసం పిండుకుని తాగితే, స్పైసీ గోవా జ్యూస్ అదిరిపోతుంది. కావాలంటే ఈసారి టేస్ట్ చేయండి.

Admin

Recent Posts