వినోదం

Ravali : ఒక‌ప్పుడు ముద్దుగా ఉండే ర‌వళి ఇప్పుడు ఎంత బొద్దుగా మారింది..!

Ravali : ఒక‌ప్పుడు ఎంతో క్యూట్‌గా ఉండే హీరోయిన్స్ ఇప్పుడు చాలా బొద్దుగా మారి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రవళి తెలుగు ప్రేక్షకులకి చాలా సుప‌రిచితం. పెళ్లిసందడి, ముద్దులమొగుడు, నిన్నేప్రేమిస్తా, స్టాలిన్.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన రవళి.. 2007లో మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి త‌ర్వాత నుండి ర‌వ‌ళి సినిమాల్లో న‌టించడ‌మే మానేసింది. రవళికి ఇద్దరు పాపలు. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌కి టైం కేటాయించిన రవళి తర్వాత బయటెక్కడా పెద్దగా కనిపించలేదు. ఆమె అక్క‌ హరిత మాత్రం సినిమాలు, సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ మ‌ధ్య పెళ్లి సంద‌డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ర‌వళి గెస్ట్ గా వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో తాను నా పేరు రవళి అంటూ ప‌రిచ‌యం చేసుకోవ‌ల్సి వ‌చ్చింది. ఒకప్పుడు ఎంతో ముద్దుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న రవళి ప్రస్తుతం అధిక శరీర బరువు పెరగడంతో తనని గుర్తుపట్టలేరేమోనని తనను తాను పరిచయం చేసుకుంది. అధిక శరీర బరువు పెరగటం వల్ల ఎవరూ తనని గుర్తు పట్టలేక పోతున్నారని అందుకే బ‌య‌ట‌కు రావ‌డం లేదు అని ర‌వ‌ళి చెప్పుకొచ్చింది. 18 ఏళ్లకే నటిగా మలయాళం సినిమాతో కెరీర్ ప్రారంభించిన రవళి.. జ‌గపతి బాబు, శ్రీకాంత్, నాగార్జున, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది.

actress ravali latest photos viral on social media

మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ర‌వ‌ళి తిరుపతిలో దైవదర్శనానికి వచ్చి కెమెరా కంటపడ్డారు. ప్రస్తుతం రవళి చాలా మారిపోయింది ఒకప్పటి ఫేవరేట్ హీరోయిన్ గా ఉన్న రవళి ఇలా మారిపోయింది. . ఇన్నేళ్లల్లో ఆమె చాలా మారిపోయింది. మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైన అంత అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇలా బొద్దుగా మార‌డం అభిమానుల‌కి మింగుడుప‌డ‌డం లేదు.

Admin

Recent Posts