Viral Video : దోశ.. అంటే సహజంగానే చాలా మందికి ఇష్టమే. దోశల్లో మనకు అనేక రకాల వెరైటీ దోశలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల దోశలను మనం ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. కొన్ని వెరైటీలు మనకు కేవలం బయట మాత్రమే లభిస్తాయి. ప్రస్తుత తరుణంలో ఆహార ప్రియుల కోసం రోడ్డు పక్కన మొబైల్ క్యాంటీన్లలో రకరకాల దోశలను వేసి విక్రయిస్తున్నారు. అయితే దోశలన్నింటిలోనూ చాలా మంది ఇష్టపడేది మసాలా దోశ. మధ్యలో ఆలు కూర ఉంటుంది. దాన్ని సరిగ్గా తయారు చేసి దోశను బాగా వేయాలే కానీ.. ఆ దోశను తింటుంటే స్వర్గం కనిపిస్తుంది.
అయితే మసాలా దోశను మనం ఎప్పుడైనా సరే ఒక వైపు నుంచి మొదలు పెట్టి రెండో వైపుకు వచ్చి అక్కడి వరకు తిని ముగించేస్తాం. కానీ ఓ ఫుడ్ బ్లాగర్ మాత్రం వెరైటీగా దోశను ఆరగించింది. ఓ రెస్టారెంట్‌లో మసాలా దోశను తెప్పించుకున్న ఆమె ముందుగా ఫోర్క్ సహాయంతో దోశ మధ్యలో కట్ చేసింది. తరువాత అక్కడి నుంచి దోశను తినడం మొదలు పెట్టింది. సాధారణంగా మసాలా దోశలో కూర మధ్యలో ఉంటుంది. కానీ మనం ఒక చివరి నుంచి మొదలు పెడితే దోశ కొద్దిగా తింటేనే గానీ మసాలా కూర మనకు లభించదు. కానీ పైన చెప్పిన ఆమె తిన్నట్లుగా తింటే ఆరంభం నుంచే మసాలా దోశలోని కూరను ఎంజాయ్ చేయవచ్చు. దీంతో మసాలా దోశను తిన్న అనుభూతి చక్కగా కలుగుతుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటికే దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాము మసాలా దోశను తప్పుగా తిన్నామని.. ఇన్ని రోజులూ అసలు ఈ విషయం తెలియదని.. వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.