హెల్త్ న్యూస్

నిజంగా గ్రేట్.. 57 ఏళ్ల వ‌య‌స్సులో ఏకంగా 20 కేజీలు త‌గ్గి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్..

సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్ వెంక‌ట కృష్ణ ప్యూర్ వెజిటేరియ‌న్‌. అత‌ని వ‌య‌స్సు 57 సంవ‌త్స‌రాలు. అత‌ను త‌న జీవిత కాలంలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య ఎదుర్కోలేదు. కాని త‌న స్నేహితుడు ఫిట్‌నెస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండ‌గా, అక‌స్మాత్తుగా మర‌ణించాడు. అది వెంక‌ట కృష్ణ‌ని చాలా బాధించింది. 2008 సంవత్సరంలో, వెంకట కృష్ణ‌ బరువు 89 కిలోలు. దాని వ‌ల‌న ఆరోగ్య స‌మ‌స్య క‌లుగుతుంద‌ని భావించి తీవ్రంగా వ్యాయామం చేయ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో బరువు కోల్పోయి 69 కిలోల బ‌రువు త‌గ్గాడు. అయితే, మ‌ధ్యలో అత‌ను వ్యాయామం ప‌క్క‌న పెట్ట‌డంతో మ‌ళ్లీ బ‌రువు పెరిగాడు. 2017లో అత‌ను 78 కేజీల బ‌రువు పెరిగాడు. అంతేకాదు అత‌నికి మ‌ధుమేహం ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయింది.

అయితే కొన్ని నెల‌ల క్రితం ఎంతో ఫిట్‌గా క‌నిపించే అత‌ని స్నేహితుడు అక‌స్మాత్తుగా మ‌ర‌ణించ‌డంతో ఆరోగ్యానికి తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని అనుకున్నాడు. ప్రతి రోజు భోజనం తర్వాత నడవడం ప్రారంభించాడు. డైట్ కూడా మార్చాడు. ఎక్కువ ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉన్న ఫుడ్ తీసుకున్నాడు. మిల్లెట్లను భోజనంలో చేర్చారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేసేలా అత‌ని ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి. అలా చేయ‌డం వ‌ల‌న బరువు, మందుల మోతాదు రెండూ తగ్గాయి. అతను తన మధుమేహ మందుల స్థాయిలను రోజుకు 2000 mg నుండి 500 mgకి తగ్గించాడు.

this software consultant reduced his weight by 20 kgs in his 57 years age

ఇదే స‌మ‌యంలో అతను శరీరాన్ని అధ్యయనం చేయడంలో ఆసక్తి కనబరిచాడు . పోషకాహారం మరియు వ్యాయామం సాధారణంగా ఆరోగ్యంపై ఎలా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి అనేది తెలుసుకున్నాడు. అతను యూట్యూబ్‌లో వివిధ యూట్యూబర్‌లు, ఫిట్‌నెస్ నిపుణుల నుండి ప‌లు సూచ‌న‌లు తీసుకొని మొత్తానికి త‌న ఆరోగ్యంపై ప‌ట్టు సాధించాడు. ఇప్పుడు అత‌ను చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచాడు. ప్ర‌స్తుతం అత‌ని ఫోటోలు, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన వార్త‌లు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Sam

Recent Posts