vastu

మంగళవారం బెల్లాన్ని ఈ ప్రదేశంలో ఇలా పాతిపెట్టండి.. భూములు కొంటూనే ఉంటారు..!

నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని కుజుడు అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇతర గ్రహాల మాదిరిగానే కుజుడు కూడా పలు మంచి, చెడు ఫలితాలను ఇస్తుంటాడు. జాతకంలో కుజ దోషం ఉంటే పెళ్లి కాదని, అయినా సంసార జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయని చెబుతారు. మంగళవారం కుజుడికి అనుకూలమైన రోజు. కనుక ఏదైనా పూజ చేస్తే ఆ రోజు చేయాల్సి ఉంటుంది. అందుకనే కుజున్ని మంగళుడు అని కూడా అంటారు. ఇక కుజున్ని పాప గ్రహంగా చెబుతారు. ఎందుకంటే కుజుడు చాలా మందికి ప్రతికూల ఫలితాలనే ఇస్తుంటాడు. అయితే ఒక పని చేస్తే కుజుడు మనపై అనుగ్రహం చూపిస్తాడు. ప్రతికూల ఫలితాలకు బదులుగా అనుకూల ఫలితాలను ఇస్తాడు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మంగళవారం రోజు తలస్నానం చేసి ఎవరూ లేని ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లండి. మీరు అక్కడ ఉన్నది మీరు చేస్తున్నది ఎవరూ చూడరాదు. అలాగే మీరు చేయబోయే పనికి చెందిన ప్రదేశం ఎవరూ కాళ్లతో తిరగనిది అయి ఉండాలి. ఎవరూ అక్కడ నడవరాదు. అలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అందులో ఒక అడుగు లోతులో చిన్న గొయ్యి తవ్వాలి. అనంతరం కొన్ని బెల్లం ముక్కలను అందులో వేయాలి. బెల్లం ఎంత పాతది అయితే అంత మంచిది. బెల్లం ముక్కలను వేసిన తరువాత వాటిపై మట్టిని 9 సార్లు చిన్న చిన్నగా పోయాలి. తరువాత గొయ్యిని పూడ్చేయాలి.

put jaggery in this location on tuesday for luck and wealth

ఇలా చేసిన తరువాత 5 నిమిషాల పాటు అక్కడే ఉండండి. మీ మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి. ఏదైనా ఒక కోరికను మాత్రమే కోరాలి. భూ వివాదాలు, కోర్టు కేసులు, ప్రశాంతమైన జీవితం.. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కించడంలో కుజుడు అనుగ్రహిస్తాడు. కనుక ఆ తరహా కోరిక ఏదైనా కోరండి. తరువాత ఇంటికి వచ్చేయండి. ఇలా చేసిన తరువాత తొందరలోనే మీ సమస్య పరిష్కారం అవడాన్ని మీరు గమనించవచ్చు. కుజుడికి బెల్లం అంటే ఇష్టం. మంగళవారం దాన్ని సమర్పిస్తే కుజుడు అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా భూ వివాదాలు పరిష్కారమవుతాయి. అలాగే ఇలా చేయడం వల్ల భూమి కూడా లభిస్తుంది. కొత్తగా భూమి కూడా కొంటారు. ఇలా కుజుడి అనుగ్రహంతో సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.

Admin

Recent Posts