10 Lung Cleaning Foods : ఈ 10 ఆహారాల‌ను తింటే చాలు.. మీ ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి..!

10 Lung Cleaning Foods : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. శ‌రీరంలో ఇత‌ర అవ‌య‌వాల వ‌లె ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మ‌నం కాపాడుకోవాలి. కానీ నేటి త‌రుణంలో చాలా మంది శ్వాస సంబంధిత స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ త్రాగ‌టం వంటి వివిధ కార‌ణాల చేత ఊపిరితిత్తులల్లో వ్య‌ర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో ఊపిరితిత్తుల‌ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. దీని వ‌ల్ల‌ చాలా మంది ద‌గ్గు, జ‌లుబు వంటి వాటితో పాటు వివిధ ర‌కాల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇటువంటి స‌మస్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉండాలంటే మ‌నం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవాలి. ఊపిరితిత్తుల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీని కోసం మ‌నం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు వాటిని శుభ్ర‌ప‌రిచే ఆహారాల‌ను తీసుకోవాలి.

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఆహారంలో భాగంగా ప‌సుపును తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా ఊపిరితిత్తుల‌కు ఎటువంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా చేయ‌డంలో ప‌సుపు మ‌న‌కు ఎంతో దోహ‌ప‌డుతుంది. అలాగే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీ వంటి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఫ్రీరాడిక‌ల్స్ నుండి ఊపిరితిత్తులను కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

10 Lung Cleaning Foods take daily for better health
10 Lung Cleaning Foods

అలాగే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉండే పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌తో పాటు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వాత‌వ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌చ్చు. అదే విధంగా రోజూ ఒక క‌ప్పు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఉండే ఫాలీఫినాల్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా త‌లెత్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను త‌గ్గించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మ‌న‌కు నారింజలు కూడా ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.

వీటిలో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించ‌డంలో తోడ్ప‌డ‌తాయి. అలాగే రోజూ ఆహారంలో భాగంగా బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్, చియా విత్తనాలు, అవిసె గింజ‌లు వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ప‌ని చేస్తాయి. అలాగే రోజూ వారి ఆహారంలో భాగంగా ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను మ‌న రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts