ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎంతో మందికి రక్తం అవసరం ఉంటుంది. శస్త్ర చికిత్సలు జరిగే వారికి, ప్రమాదాలు జరిగి రక్తం కోల్పోయేవారికి, థలసేమియా వంటి వ్యాధులు ఉన్నవారికి, ఇంకా ఇతరులకు రక్తం అవసరం అవుతుంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనన్ని సార్లు రక్తదానం చేస్తే మంచిది. అయితే రక్తదానం చేసేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ నిజానికి రక్తదానం వల్ల మనకు లాభాలే కలుగుతాయి. అవేమిటంటే..
1. రక్తదానం తరచూ చేయడం వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు 33 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
2. మనం నిత్యం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను లివర్, క్లోమ గ్రంథి నిల్వ చేసుకుంటాయి. అయితే వాటిల్లో ఐరన్ నిల్వలు పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో తరచూ రక్తదానం చేయడం వల్ల ఆయా భాగాల్లో నిల్వ ఉండే ఐరన్ పూర్తిగా వినియోగం అవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
3. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు తయారు అవుతాయి. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
4. రక్తదానం తరచూ చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. రక్తదానం వల్ల లివర్, పేగులు, ఊపిరితిత్తులు, గొంతు భాగాలకు చెందిన క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
5. రక్తదానం చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.