Ajwain Cumin Water : మన ఇంట్లోనే ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల దాదాపు మనం 40 అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఔషధాన్ని వాడడం వల్ల థైరాయిడ్ సమస్యను, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను, కాలేయ సంబంధిత సమస్యలను, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు రాలడాన్ని, అధిక బరువును, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను, పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును, కీళ్ల నొప్పులను తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఈ ఔషధం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా స్త్రీలల్లో వచ్చే గర్భాశయ సమస్యలను నయం చేయడంలో కూడా ఈ ఔషధం మనకు సహాయపడుతుంది.
అలాగే ఈ ఔషధాన్ని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటామని అలాగే దీనిని ఏ వయసు వారైనా కూడా తీసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మన చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ లో ఒక టీ స్పూన్ వేయించిన ధనియాలను, ఒక టీ వామును, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్రను వేయాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని ఒక గిన్నెలో పోసి వేడి చేయాలి. ఒక గ్లాస్ నీరు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టుకోవాలి.
తరువాత ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో తగినంత బెల్లం వేసి కలిపి తాగాలి. ఇలా రోజూ ఉదయం పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల మనపం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ నీటిని తాగడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని తాగడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. దగ్గు, జలుబు, గొంతు సమస్యలతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి.
అలాగే ఈ పానీయాన్ని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో, రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఈ పానీయం మనకు సహాయపడుతుంది. ఈ విధంగా మన ఇంట్లో ధనియాలు, వాము, జీలకర్ర వంటి వాటితో చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల 40 రకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.