Ajwain Leaves For Lungs : గుప్పెడు ఆకులు చాలు.. ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోతాయి..!

Ajwain Leaves For Lungs : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవయ‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. క‌నుక వీటిని మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఊపిరితిత్తుల‌ ఇన్ఫెక్ష‌న్స్, ఆస్థ‌మా, న్యుమోనియా, ద‌గ్గు, బ్రాంకైటిస్ వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వీటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అలాగే ఈ స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంటుంది కూడా.

ఇలా ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు స‌హ‌జ సిద్దంగా ల‌భించే వామాకును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వామాకులో థైమాల్, కార్వ‌కాన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లో శ్లేష్మాలు ఎక్కువ‌గా త‌యార‌వ్వ‌డానికి కార‌ణ‌మ‌య్యే హిస్ట‌మిన్స్ ఉత్ప‌త్తిని త‌గ్గించ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా వామాకును వాడ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా త‌లెత్తే ఇబ్బంది, చికాకు త‌గ్గుతుంది. ఆస్థ‌మా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వామాకును వాడ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా కూడా తెలియ‌జేసారు.

Ajwain Leaves For Lungs very effective remedy
Ajwain Leaves For Lungs

ఆస్థ‌మా స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి ఇండ్ల‌ల్లో ఈ వామాకు మొక్క త‌ప్ప‌కుండా ఉండాల‌ని కూడా వారు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ వామాకును ప‌చ్చడిగా చేసి తీసుకోవ‌చ్చు. అలాగే నీటిలో వామాకును వేసి మ‌రిగించి ఆ నీటిని తాగ‌వ‌చ్చు. వంట‌ల్లో కూడా వామాకును వాడుకుకోవ‌చ్చు. ఏదో ఒక రూపంలో రోజూ గుప్పెడు వామాకును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్యలు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో పాటు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts