Allam Kashayam : అల్లంతో క‌షాయం త‌యారీ ఇలా.. దీన్ని తాగితే ఎన్నో రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..

Allam Kashayam : అల్లం.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా వంటల్లో మ‌నం అల్లాన్ని ఉప‌యోగిస్తూ ఉన్నాం. వంట‌ల్లో అల్లాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. అల్లంలో మ‌న‌ శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ఇంటి చిట్కాల్లో, అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను తగ్గించ‌డంలో ఈ అల్లాన్ని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైర‌ల్, యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు అనేక ర‌కాల ఇన్ఫెక్ష‌న్ ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాము. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.

దీంతో మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను క‌డా పొంద‌వ‌చ్చు. అయితే అల్లాన్ని ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వంట‌ల్లో వాడ‌డం కంటే అల్లాన్ని నేరుగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అల్లం రసాన్ని తీసుకున్నా లేదా దానితో క‌షాయాన్ని చేసుకుని తాగినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అల్లం క‌షాయాన్ని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ రెండు ఇంచుల అల్లం ముక్క‌ను తీసుకుని శుభ్ర‌ప‌రిచి ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత వీటిని కచ్చా పచ్చాగా దంచుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక దంచుకున్న అల్లం ముక్క‌ల‌ను వేసి మ‌రిగించాలి.

Allam Kashayam how to make it take daily for these benefits
Allam Kashayam

నీళ్లు చ‌క్క‌గా మ‌రిగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వ‌డ‌క‌ట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ క‌షాయం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత నేరుగా తాగ‌వ‌చ్చు లేదా ఇందులో తేనె, నిమ్మ‌ర‌సం కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. ఈ క‌షాయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల జలుబు, ద‌గ్గు, త‌ల‌తిర‌గ‌డం, మైగ్రేన్ వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలో, అల్జీమ‌ర్స్ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా అల్లం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంలో, స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా అల్లం మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అల్లం క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. అల్లం క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల లేదా అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ఈ విధంగా అల్లం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అల్లం క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts