Potato Wedges : బేక‌రీల‌లో ల‌భించే పొటాటో వెడ్జెస్‌.. మీరు కూడా ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..

Potato Wedges : మ‌నం బంగాళాదుంప‌ల‌తో కూర‌లే కాకుండా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ చిరుతిళ్ల‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పొటాటో వెడ్జెస్ కూడా ఒక‌టి. రెస్టారెంట్ ల‌లో ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతాయి. ఎంతో రుచిగా ఉండే ఈ పొటాటో వెడ్జెస్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పొటాటో వెడ్జెస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో వెడ్జెస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), కార్న్ ఫ్లోర్ – 4 టీ స్పూన్స్, మైదాపిండి – 3 టీ స్పూన్స్, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, వెల్లుల్లి త‌రుగు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Potato Wedges recipe in telugu make in this way
Potato Wedges

పొటాటో వెడ్జెస్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌ను పొట్టు తీయ‌కుండా శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని నిలువుగా ముక్క‌లుగా చేసుకోవాలి. ఒక్కో బంగాళాదుంప‌ను 8 ముక్క‌లుగా చేసుకుని నీటిలో వేసి మ‌ర‌లా క‌డ‌గాలి. త‌రువాత వీటిని ఒక గిన్నెలో వేసి అవి మునిగే వ‌ర‌కు నీటిని పోసి ఉడికించాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి 50 శాతం ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. బంగాళాదుంప ముక్క‌లు పూర్తిగా ఆరిన త‌రువాత ఒక గిన్నెలోకి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత మ‌రో గిన్నెలో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని బ‌జ్జీ పిండిలా పలుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా సిద్దం చేసుకున్న బంగాళదుంప ముక్క‌ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో వెడ్జెస్ త‌యారవుతాయి. వీటిని వేడి వేడిగా ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో ఈ విధంగా బంగాళాదుంప‌ల‌తో స్నాక్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా వెడ్జెస్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts