Almonds With Honey : మన శరీరానికి శక్తివంతమైన పోషకాలను అందించే ఆహారాల్లో బాదం పప్పు కూడా ఒకటి. దీనిని కింగ్ ఆఫ్ నట్స్ అని పిలుస్తారు. బాదం పప్పులను తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు నేరుగా లేదా నానబెట్టుకుని తింటూ ఉంటారు. రోజూ ఆరు బాదం గింజలను ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టి పైన పొట్టును వలుచుకుని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా బాదం గింజలను నానబెట్టుకుని తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిలో మోనోశాచురేటెడ్, పాలీ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో మనం అధిక బరువును సులుభంగా తగ్గించుకోవచ్చు. తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడే వారు బాదంపప్పును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాదం పప్పును తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటారు. ప్రతి రోజూ భోజనం తరువాత నాలుగు బాదం గింజలను తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. శరీరానికి శక్తిని ఇచ్చే పోషకాలు బాదం పప్పులో అధికంగా ఉంటాయి.
నీరసంగా ఉన్నప్పుడు బాదం గింజలను తినడం వల్ల లేదా బాదం పాలను తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. బాదం పప్పును తరచూ తినడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. వయసు మీద పడడం వల్ల వచ్చే ముడతలను తగ్గించి ముఖం కాంతివంతంగా కనిపించేలా చేయడంలో కూడా బాదం పప్పు సహాయపడుతుంది. బాదంపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. బాదం పప్పులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
బాదం పప్పును తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. బాదం పప్పును నానబెట్టుకుని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బాదం పప్పును తేనెలో నానబెట్టుకుని తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్య కూడా దూరమవుతుంది. బాదం గింజలపై పొట్టును తీయకుండా నేరుగా తినడం వల్ల అవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కనుక బాదంగింజలను రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు వలుచుకుని తినాలి. లేదా ఉదయం నానబెట్టి రాత్రి పొట్టు తీసి తినవచ్చు. ఈ విధంగా బాదంపప్పును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.