Ponnaganti Aku Kura Pappu : పొన్న‌గంటి ఆకుకూర ప‌ప్పు.. ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ponnaganti Aku Kura Pappu : మ‌నం ఆహారంలో భాగంగా ఆకుకూర‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మన శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పొన్న‌గంటి కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పొన్న‌గంటి కూర‌తో ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొన్న‌గంటి ఆకుకూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, పొన్న‌గంటి కూర – 4 క‌ప్పులు, నీళ్లు – మూడు క‌ప్పులు, త‌రిగిన ఉల్లిపాయ -1, త‌రిగిన ట‌మాట – 1, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – 10 గ్రా.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఇంగువ – చిటికెడు.

make Ponnaganti Aku Kura Pappu  in this method very tasty
Ponnaganti Aku Kura Pappu

పొన్న‌గంటి ఆకుకూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డగాలి. త‌రువాత నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టుకోవాలి. ఇలా నాన‌బెట్టుకున్న త‌రువాత చింత‌పండు గుజ్జు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత రుచికి త‌గినంత చింత‌పండు గుజ్జును వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి.

ఇలా చేసుకున్న తాళింపును ముందుగా ఉడికించిన ప‌ప్పులో వేసి క‌లపాలి. త‌రువాత ప‌ప్పును కూడా స్ట‌వ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొన్న‌గంటి కూర ప‌ప్పు త‌యార‌వుతుంది. ఈ ప‌ప్పు త‌యారీలో పొన్న‌గంటి కూర‌కు బ‌దులుగా ఏ ఇత‌ర ఆకుకూర‌నైనా వేసుకోవ‌చ్చు. ఇలా తయారు చేసుకున్న ప‌ప్పును అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts